Celebrities tweets on Pahalgam attack:
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం లో చోటు చేసుకున్న సంఘటన ప్రపంచం అంతా షాప్ కి గురి చేసింది. అక్కడ జరిగిన ఉగ్రదాడి.. దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించింది. ముఖ్యంగా ఈ దారిలో ఎంతోమంది పర్యాఠకులు ప్రాణాలు కోల్పోయారు.
ఎంతోమంది హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా “All Eyes on Pahalgam” అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇందులో భాగంగా.. ఎంతోమంది సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు.
మన తెలుగు హీరోలు ఎంతోమంది ఈ ఘటనపై స్పందించి తమ నిరసన వ్యక్తం చేశారు. రామ్ చరణ్, మహేష్ బాబు ఇలా చాలామంది ఈ విషయంపై తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. బాధితుల కుటుంబాలకు తమ సంతాపం తెలియజేశారు.
Shocked and saddened by the terror attack in Pahalgam. Such incidents have no place in our society and should be strongly condemned.
My prayers are with the families of those affected.
— Ram Charan (@AlwaysRamCharan) April 22, 2025
A dark day… Deeply saddened by the attack in #Pahalgam.
Hope we find the strength to stand together against such cruelty..??????My thoughts and prayers are with the families during this difficult time….— Mahesh Babu (@urstrulyMahesh) April 23, 2025
అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఈ విషయంపై అస్సలు స్పందించకపోవడం ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో కొంతమంది స్టార్ హీరోలు సైతం ఈ విషయంపై అసలు స్పందించలేదు. దాంతో వారు స్పందించాలని కూడా అభిమానులు సోషల్ మీడియా వేడుకగా కోరుతున్నారు.
మరోపక్క సౌత్ సెలబ్రిటీస్ కూడా కొంతమంది దీనిపైన స్పందించకపోవడంతో.. వారి పైన కూడా అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో కొన్నిసార్లు తెలిసి తెలియక ఇండియా, పాకిస్తాన్ గురించి వ్యాఖ్యలు చేసి వైరల్ అయిన సెలబ్రెటీస్ అందరిని ఇప్పుడు నేటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
సాయి పల్లవి గతంలో ఒక ఇంటర్వ్యూలో పాకిస్తాన్ వారందరూ మన ఇండియా వారిని టెర్రరిస్టులు అనుకుంటారు అని చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. ఈ క్రమంలో అప్పుడు అలా మాట్లాడిన సాయి పల్లవి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు అని కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.
National crush, my foot!#PahalgamTerroristAttack #पहलगाम #Pahalgampic.twitter.com/I4LKXnyK1Z
— Kreately.in (@KreatelyMedia) April 23, 2025
మరోపక్క ఈ రేంజ్ కామెంట్స్ ప్రకాష్ రాజ్ పైన కూడా వినిపిస్తున్నాయి. సౌత్ లో ప్రకాష్ రాజుకి ఎంత పేరు ఉందో అందరికీ తెలిసిన విషయమే. విలక్షణ నటుడు అనగానే ఆయన పేరు గుర్తొస్తుంది. ఎన్నో సినిమాలలో ఎన్నో క్యారెక్టర్ చేసి తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు. కానీ సినిమాలలో ఈయనకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న.. నిజజీవితంలో మాత్రం తరచు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలో తరచూ ఏదో ఒక వివాదాన్ని సోషల్ మీడియాలో చర్చకు తెచ్చే ప్రకాష్ రాజ్..పహల్గాం విషయం గురించి మాత్రం ఒక్క పోస్టు కూడా పెట్టకపోవడం గమనర్హం. ఆఖరికి నిన్న సాయంత్రం కూడా ప్రకాష్ రాజ్ ఒక పోస్ట్ తన సోషల్ మీడియాలో వేశారు. ఇంతలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఆయన దేశం మొత్తం కదిలించి వేస్తున్న ఈ అటాక్ గురించి మాత్రం ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం ఏంటి అంటూ ఎంతోమంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రకాష్ రాజ్ .. మోదీ.. ప్రభుత్వానికి వ్యతిరేకం అన్నది తెలిసిన విషయమే.
కానీ ఇలాంటి హృదయాన్ని కదిలించే విషయాన్ని.. పాలిటిక్స్ పరంగా చూడడం అసలు తగదు. మరి ఈ క్రమంలో ఈయన ఈ విషయం గురించి స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
మరి ఇప్పటికైనా ఆయన ఈ విషయం పైన ఏమన్నా వ్యాఖ్యలు చేస్తారేమో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









