శ్రీరామ చంద్ర పాడిన రేస్ 3 సినిమా వీడియో సాంగ్

అల్లా దుహాయి హై వీడియో సాంగ్ లాంచ్ 

Last Updated : Jun 2, 2018, 12:57 PM IST
శ్రీరామ చంద్ర పాడిన రేస్ 3 సినిమా వీడియో సాంగ్

సల్మాన్ ఖాన్ నటించిన రేస్ 3 సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాతలు ప్రమోషన్స్‌పై దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇవాళ రేస్ 3 సినిమాలోంచి అల్లా దుహాయి హై అనే పాటను విడుదల చేశారు. రేస్ సినిమాలో సూపర్ హిట్ అయిన అల్లా దుహాయి హై పాటను ఈ సినిమాలోనూ రీమేక్ చేసి మరింత అందంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ పాటను పాడిన సింగర్స్ ముగ్గురు కాగా అందులో మన తెలుగు సింగర్, ఒకప్పటి ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామ చంద్ర కూడా ఉన్నారు. తుషార్ జోషి కంపోజ్ చేసిన మ్యూజిక్ సైతం మ్యూజిక్ లవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇవాళ రిలీజైన ఈ పాటను అప్పుడే యూట్యూబ్‌లో .5 మిలియన్ వ్యూయర్స్ వీక్షించగా దాదాపు 75వేల లైక్స్ వచ్చాయి. 

 

అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో డైసీ షా, సాకిబ్ సలీం, ఫ్రెడ్డీ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కిక్ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇద్దరూ కలిసి జంటగా నటించడం మళ్లీ ఇదే మొదటిసారి. రెమో డిసౌజ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ ఏడాది ఈ కానుకగా జూన్ 15వ తేదీన ఆడియెన్స్ ముందుకు రానుంది. 

Trending News