Allu Arjun Shares Pushpa 2 Stampede Meme: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి కారణం ఆయన ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ అక్క అకౌంట్. రెడిట్‌లో ఒక పోస్ట్ వైరల్ అవుతూ.. ‘bunny_boy_private’ అనే ఖాతా అల్లు అర్జున్‌దే అని పేర్కొంది. ఇందులో ఆయన ర్యాండమ్ మీమ్స్ పోస్ట్ చేస్తుంటాడని చెప్పబడింది. ప్రత్యేకంగా, పుష్ప 2 ప్రమోషన్ సమయంలో జరిగిన స్టాంపీడ్ ఘటనపై ఒక మీమ్ షేర్ చేశారని వార్తలు వైరల్ అయ్యాయి.
Allu Arjun Instagram Account : ఈ ఖాతాలో 1380 పోస్టులు, 319 ఫాలోవర్లు ఉన్నట్లు స్క్రీన్‌షాట్‌లో కనిపించింది. ఈ మీమ్‌ను రానా దగ్గుబాటి కూడా రీషేర్ చేయడం మరింత సంచలనం రేపింది. ఈ మీమ్‌లో, జైలు నుండి తిరిగి వచ్చిన తరువాత అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన స్నేహితుల ఫొటోను షేర్ చేస్తూ దానితో ఒక మీమ్ చేశారు.
ఇక ఈ పోస్ట్ స్క్రీన్ షాట్ తీసి.. రెడిట్ అకౌంట్ లో పెట్టారు ఒకరు. ఇక ఈ పోస్ట్ చూసి కొంతమంది.. అల్లు అర్జున్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. "ఒక మనిషి చనిపోయిన సంఘటనపై మీమ్ వేయడం ఏంటి?" అంటూ మండిపడ్డారు. ఇక ఈ పోస్ట్ ని రానా, సమంతా లాంటి వారు లైక్ చెయ్యగా.. రానా దాన్ని తిరిగి కూడా పోస్ట్ చేశారు.
పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని థియేటర్లో జరిగిన స్టాంపీడ్‌లో ఒక యువతి మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యతలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినప్పటికీ, అనంతరం అతనికి బెయిల్ మంజూరు అయింది. ఇక ఆ తర్వాత సెలబ్రిటీస్ అందరూ వచ్చి అల్లు అర్జున్ పరామర్శించారు. ఆ క్రమంలో తీసిన ఫోటో గురించి మీమ్ పైన ఎప్పుడు చర్చ మొత్తం జరుగుతోంది.
ఈ మొత్తం వ్యవహారంలో నిజమెంత, పుకారెంత అనేది అధికారికంగా వెల్లడి కావాల్సిన విషయమే. అయితే, ఓ స్టార్ హీరో వ్యక్తిగత ఖాతాలో ఇలా మీమ్స్ పోస్ట్ చేయడమే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









