Allu Arjun Arrest:  హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య టాకీస్ లో జరిగిన తొక్కిలలాటలో తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు బన్నిని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంధ్య టాకీస్ లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్ ను ఓ నిందితుడిగా చేర్చారు పోలీసులు. తమకు సరైన సమాచారం లేకుండా హీరో అక్కడికి వెళ్లడం   అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో చనిపోయిన యువతి కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ జనం కాళ్ల నలిగిపోయాడు. ప్రస్తుతం ఆ బాలుడు ప్రమాదం నుంచి బయట పడ్డారని  హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా జరిగిన ఘటనపై అల్లు అర్జున్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు థియేటర్స్ కు వచ్చే ముందు తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో సంధ్యా థియేటర్ యజమాని మేనేజర్ సెక్యూరిటీ మేనేజర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు అర్జున్ తీరును తప్పు పడుతున్నారు. తమకు ముందస్తు సమాచారం లేకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందదన్నారు.


కేసులో సెక్షన్లు ఏం చెబుతున్నాయంటే.. ఈ కేసుకు సంబంధించిన కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహితలోని 105, 118/(1),  3(5) సెక్షన్స్ ప్రకారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో బన్ని పై కేసు నమోదు చేసారు.


సెక్షన్ 105 ప్రకారం.. హత్య లేదా ప్రాణ నష్టం కేసుగా న్యాయ నిపుణులు చెబుతున్న మాట. ముఖ్యంగా హత్య చేయాలనే ఉద్దేశ్యం లేకపోయినా.. అతని వల్ల ఓ నిండు ప్రాణం పోవడంతో ఈ కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది.


సెక్షన్ 118(1) ప్రకారం.. ఈ సెక్షన్ నేరాన్ని ప్రేరేపించడం వంటివి అర్ధంలో ఉంది. ఒక నేరం లేదా సంఘటన జరిగిన తర్వాత ఇమిడియేట్ గా స్పందించక పోవడంలేదా నాకేమి అవుతుందిలే అని తేలిగ్గా తీసుకోవడం   కూడా నేరం కిందికే పరిగణిస్తారు. ముఖ్యంగా ఈ కేసులో యావజ్జీవ శిక్ష లేదా .. ఆయా కేసులను బట్టి న్యాయమూర్తి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది.


సెక్షన్ 3(5)ప్రకారం.. చట్ట వ్యతిరేక చర్యలకు సంబంధించినది. ఈ సబ్ సెక్షన్ తీవ్ర నేరంగా పరిగణిస్తారు.


శిక్ష ఎంత పడొచ్చు.. ఏ కేసులోనైనా శిక్షలు అనేవి న్యాయమూర్తులు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. ఏది ఏమైనా ఈ కేసుల్లో 5 యేళ్లు లేదా గరిష్ఠంగా 10 యేళ్లుగా పడొచ్చు. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చూస్తే గనుక.. 90 రోజుల తర్వాత ఆయన బెయిల్ పై బయటకు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.


ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..


ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.