Allu Arjun Atlee Movie Update: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరో భారీ సినిమా రూపొందుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్టుపై అంచనాల రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ మధ్యనే ఈ సినిమా గురించి అల్లు అర్జున్ పుట్టినరోజు అధికారికంగా ప్రకటించగా.. ఈ భారీ సినిమా బడ్జెట్ ప్రస్తుతం ఫిలింనగర్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ చిత్రం పేరును తాత్కాలికంగా AA22 x A6 గా పెట్టారు.
ఈ సినిమా బడ్జెట్ ప్రకారం, ఇది భారతదేశంలో మూడవ ఖరీదైన సినిమా. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న SSSB 29 (రూ.1000 కోట్లు) తర్వాత, రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణం (రూ.900 కోట్లు) రెండవ స్థానంలో ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ – అట్లీ సినిమా రూ.800 కోట్ల బడ్జెట్‌తో మూడో స్థానంలో నిలవనుంది. ఇక ఈ సినిమాకి ఇంత బడ్జెట్ అనడంతో.. అసలు ఎందుకు ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టాలనుకుంటున్నారు అని ప్రశ్నలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ఈ సినిమా బడ్జెట్ ఎక్కడెక్కడ ఎంత పెడుతున్నారు అనే వార్త అది కూడా వైరల్ అవుతున్నాయి..బడ్జెట్ విడదీసి చూస్తే
రూ.200 కోట్లు - ప్రొడక్షన్‌కి
రూ.250 కోట్లు - విజువల్ ఎఫెక్ట్స్ (VFX)
రూ.175 కోట్లు - అల్లు అర్జున్ రెమ్యూనరేషన్
రూ.100 కోట్లు - డైరెక్టర్ అట్లీకు
మిగతా వ్యయాలు ఇతర అవసరాల కోసం అని తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు రెమ్యూనరేషన్‌తో పాటు సినిమా లాభాల్లో 15% షేర్ కూడా ఉంటుందని సమాచారం. అలాగే అట్లీకి కూడా బ్యాక్‌ఎండ్ డీల్ ఉందట.
ముఖ్యంగా ఈ సినిమాలో హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసమే ఎక్కువగా ఉపయోగించనున్నారు అని వెనకేరి. ఈ సినిమాకి హాలీవుడ్‌లో ‘అవతార్’, ‘ఐరన్ మ్యాన్’ లాంటి చిత్రాలపై పని చేసిన టెక్నీషియన్లు పని చేస్తున్నారు. సినిమా కథ ఫాంటసీ నేపథ్యంలో ఉండే అవకాశం ఉంది. ఇందులో అల్లు అర్జున్ డ్యుయెల్ రోల్ చేయనున్నట్టు టాక్. అట్లీ దర్శకత్వంలో ఇలాంటివి మామూలే.
ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఆగస్ట్ 2025లో ప్రారంభమవుతుంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న చిన్న టీజర్ విడుదలైంది. అభిమానుల్లో ఇప్పటికే ఈ సినిమా పట్ల భారీ అంచనాలున్నాయి. దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
మొత్తం మీద అల్లు అర్జున్ అట్లీ సినిమా బడ్జెట్.. భారీగా ఉండటమే కాకుండా, టెక్నికల్ టీమ్, నటీనటులు, విజువల్స్ అన్నీ ప్రపంచ స్థాయిలో ఉండబోతున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో మెగా విజువల్ ఫీస్ట్‌కు ఇది మార్గం వేస్తోంది.
Also Read: Rajiv Yuva Vikasam: లాభాలు వచ్చే వ్యాపారం చేయాలనేవారికి అద్భుత అవకాశం.. ఎల్లుండే ఆఖరి తేదీ
Also Read: RK Roja: మాజీ మంత్రి రోజాను 'ఆంటీ' అంటూ నోరు పారేసుకున్న సుడిగాలి సుధీర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









