Allu Arjun - Atlee: సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీస్ తో అల్లు అర్జున్ కెరీర్ గ్రాఫ్ ఎక్కడికో పోయింది. పుష్ప పార్ట్ 1తో జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ .. పుష్ప 2 ది రూల్ మూవీతో ఏకంగా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. అంతేకాదు ఈ సినిమా హిందీలో మన దేశంలో రూ. 800 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో సంచలనం రేపింది. అంతేకాదు బాలీవుడ్ బడా స్టార్ హీరోలైన ఖాన్స్, కపూర్స్ సాధించలేని అరుదైన రికార్డుతో దుమ్ము దులిపాడు. ఈ సినిమా సక్సెస్ తర్వాత అట్లీతో తమిళ నిర్మాత సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు.
దీనికి సంబంధించి ఓ వీడియోను షేర్ చేసారు. ఆ వీడియోలో ఈ సినిమాను అవతార్ వంటి సినిమాలకు గ్రాఫిక్స్ అందించిన లాస్ ఏంజెల్స్ కు చెందిన సంస్థ ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ పనులు చేయించబోతున్నట్టు చూపించారు.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా సూపర్ హీరో తరహాలో ఉండబోతుందని చెప్పారు. మొత్తంగా అట్లీతో చేయబోయే సినిమా ప్యాన్ ఇండియా అనే కంటే ప్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు పారితోషికాలతో పాటు అన్ని కలిపి దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది.
Thunderous 2M+ cumulative views for #AA22xA6 GearUp ⚡
A Magnum Opus from Sun Pictures?
? - https://t.co/NROyA23k7g@alluarjun @Atlee_dir #AA22 #A6 #SunPictures pic.twitter.com/BE0s5aJ7oE
— Sun Pictures (@sunpictures) April 8, 2025
రాజమౌళి, మహేష్ బాబు సినిమా తరహాలోనే ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు. అట్లీ గత చిత్రం ‘జవాన్’ హిందీలోనే దాదాపు రూ. 1000 కోట్లకుపైగా రాబట్టింది. మరి రూ. 1800 కోట్ల గ్రాస్ రాబట్టిన అల్లు అర్జున్ తో తెరకెక్కించబోయే సినిమా ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. హీరోగా అల్లు అర్జున్ కు ఇది 22వ చిత్రం. అట్లీకి 6వ చిత్రం. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం పూజానే చేతిలో ఏ సినిమా లేకుండా ఖాళీగా ఉంది. పైగా కాల్షీట్లు అందుబాటులో ఉండటంతో ఈమెనే ఖరారు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









