Mega vs Allu: మెగా - అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు.. పుష్ప సినిమాతో బట్టబయలు..!

Allu Arjun vs Mega Family: చెప్పను బ్రదర్.. అన్న దగ్గర నుంచి అల్లు అర్జున్ కి.. మెగా ఫ్యామిలీకి మధ్య ఏవో విభేదాలు ఉన్నాయని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఈ విషయం కొంచెం సద్దుమణిగినట్టు అనిపించిన.. ఈ మధ్య.. శిల్పారెడ్డి కోసం అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన దగ్గర నుంచి.. అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ.. అనే టాపిక్ మళ్ళీ జోరు అందుకుంది. ఈ క్రమంలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ప్రవర్తన.. పుష్ప సినిమాలో డైలాగ్స్ కాస్త.. అల్లు అర్జున్ డైరెక్ట్ గానే మెగా ఫ్యామిలీతో గొడవకి దిగినట్టు క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.

Last Updated : Dec 5, 2024, 04:03 PM IST
Mega vs Allu: మెగా - అల్లు  ఫ్యామిలీ మధ్య విభేదాలు.. పుష్ప సినిమాతో బట్టబయలు..!

Allu Arjun vs Pawan Kalyan: మూడేళ్ల నిరీక్షణకు.. తాజాగా ఎండ్ కార్డ్ పడింది.అల్లు అర్జున్ అభిమానులకు.. ఎట్టకేలకు పుష్-2 చిత్రం రిలీజ్ కావడంతో.. ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఈ సినిమాపై మెగా అభిమానులు మాత్రం.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ముఖ్య కారణం.. గత కొన్ని నెలలుగా మెగా కుటుంబ సభ్యులు..అల్లు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయనే విధంగా వార్తలు వినిపించడం. అందుకు తగ్గట్టుగానే ట్విట్టర్లో మెగా కుటుంబ సభ్యులైన నాగబాబు చేసిన పోస్ట్లు…తమకు అల్లు అర్జున్ అంటే పడనట్టే తెలిసేలా చేశాయి. దీంతో సోషల్ మీడియాలో కూడా ఒక వర్గం వారు అల్లు అర్జున్ సినిమాని, ఆయన నటనను టార్గెట్ చేసేలా చేశాయి. 

Add Zee News as a Preferred Source

ఇవన్నీ పక్కన పెడితే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఎవరన్నా.. ఒక మెగా హీరో పేరు ఎత్తితే చాలు.. ఈ విభేదానికి ఎండ్ కార్డ్ పడినట్టే అనుకున్నారు అందరూ. కానీ అందరిని షాక్ కి గురి చేస్తూ.. ఆర్ఆర్ఆర్ సినిమా పేరు వచ్చినప్పుడు కూడా.. రామ్ చరణ్ పేరు ఎత్తకుండా.. తాను తగ్గేదేలే అన్నట్టు ముందుకు సాగారు అల్లు అర్జున్. దాంతో అసలు ఈ సినిమానే చూడకూడదు.. అని ట్వీట్స్ పెట్టడం మొదలెత్తారు మెగా అభిమానులు. 

ఇక సినిమాకి కరెక్ట్ గా కొన్ని గంటల ముందు.. నాగబాబు సినిమా అనేది ఎంతోమంది కష్టం, ఆదరిద్దాం అని పెట్టడంతో.. అలానే సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ కి విషెస్ పెట్టడంతో.. అల్లు, మెగా హీరోలు కలిసిపోతారేమో అన్న ఆశ కొంతమంది లో వచ్చింది. కానీ సినిమా చూశాక వారందరి ఆశ కాస్త నిరాశగా మిగిలింది. పుష్ప సినిమాలో.. అల్లు అర్జున్ చెప్పిన కొన్ని డైలాగ్లు ప్రస్తుతం.. ఎన్నో కాంట్రవర్సీలకు దారితీస్తున్నాయి. ఈ డైలాగుల వల్ల మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు బట్టబయలు అయ్యాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి..

పుష్ప డైలాగ్ లలో.. ‘ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్!.. ,’ అని చెప్పే డైలాగ్ విజిల్స్ వేయించేలా చేసింది. అల్లు అర్జున్ చెప్పే డైలాగులు అభిమానులను ఖుషీ చేసినప్పటికీ.. మెగా అభిమానులను మాత్రం ఆగ్రహానికి కురిచేస్తున్నాయి. ఈ డైలాగ్స్ తో మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్.. కౌంటర్ ఇచ్చారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. 

సాధారణంగా ట్విట్టర్లో.. చిరంజీవిని అభిమానులు బాస్ అని సంబోధిస్తారు. ఇప్పుడు పుష్ప సినిమాలో.. డైలాగ్స్ చూస్తుంటే.. అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ మెగా ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా.. ఉంది అనేది ఎంతోమంది వాదన.

అంతేకాదు..’గుండు కొట్టిస్తా..’ అనే డైలాగ్ మరింత రచ్చకి దారితీస్తోంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి గుండు కొట్టిచ్చారని.. రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ కూడా అబద్ధాలు అంటూ.. పలు మార్లు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ ఈ డైలాగ్ తీసుకొని.. అల్లు అభిమానులు, మరి కొంతమంది హీరో అభిమానులు ఆ విషయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. మరి ఏ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో వేచి చూడాలి.

Also Read: AP Drone System: ఏపీ శాంతిభద్రతల్లో మరో పోలీస్‌ 'డ్రోన్‌'.. సీఎం చంద్రబాబు ఆదేశం

Also Read: Self Help Groups: మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసే ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ ప్రోగ్రామ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News