Allu Arjun Arrest Update: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు!
Allu Arjun Arrest: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్బంగా సాంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ సందర్శించగానే.. జరిగిన రచ్చలో ఓ మహిళ మరణించగా, ఆమె కుమారుడు ఆసుపత్రికి తరలించబడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. ఇప్పుడు ఇక ఇదే క్లాసు పై అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం కలకలంగా మారింది. కాగా ఇప్పుడే అల్లు అరవింద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. పూర్తి వివరాలు లోకి వెళితే..
Allu Arjun Family: అల్లు అర్జున్ సాంధ్య థియేటర్ లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో చూడడానికి వచ్చిన సమయంలో.. జరిగిన రచ్చలో పోలీసులు ఆయనను ఈరోజు..అరెస్ట్ చేసారు. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా, ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన పర్యవేక్షిస్తున్న పోలీసులు సాంధ్య థియేటర్ నిర్వహకులు, అల్లు అర్జున్, ఆయన భద్రతా బృందంపై కేసు నమోదు చేశారు.
తరువాత, ఈ కేసులో 105, 118(1) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసు 105 సెక్షన్ కింద నాన్-బైలబుల్ అయినందున, అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఈ కేసును ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అయితే, ఈ సంఘటనను పరిగణనలోకి తీసుకుని, అల్లు అర్జున్ పై విచారణ జరుగుతుందని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే ఈరోజు అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా అల్లు అర్జున్‌ను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు తరలిస్తారని సమాచారం. అల్లు అర్జున్ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించేందుకు రిపోర్ట్ కూడా రెడీ చేశారు.
ఈ క్రమంలో ఇప్పుడే..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది.
ఇక అల్లు అర్జున్‌పై BNS 118, BNS 105 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాబట్టి నేరం రుజువైతే 105 సెక్షన్ కింద.. దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల పాటు జైలు శిక్షపడే అవకాశం ఉంది. అంతేకాకుండా BNS 118 కింద కూడా.. ఒక సంవత్సరం నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇక పోలీసులు ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటికి రావడంతో.. ఆయన అర్జున్ భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఆమె భార్య భుజం తట్టి ధైర్యం చెప్పిన వీడియోస్ ఐటం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.