Allu Arjun Atlee Movie : పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ లేదా అట్లీ సినిమాను మొదటిగా స్టార్ట్ చేస్తాడా అనే అంశంపై క్లారిటీ రాకపోయినా..ఇటీవల అట్లీ ప్రాజెక్ట్‌నే మొదలు పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ సినిమా గురించి ఒక విషయం సోషల్ మీడియాలో అభిమానుల్లో కలకలం రేపుతోంది. అట్లీ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాను తీసుకోవాలని చూస్తున్నారనే వార్తలు బయటకొచ్చాయి. ఈ వార్తలు బన్నీ అభిమానులకు అసహనం కలిగిస్తున్నాయి. ప్రియాంక చోప్రా అల్లుఅర్జున్‌కు సరిపడదని వారి అభిప్రాయం. అంతేకాదు అల్లు అర్జున్ పక్కన ఆమె కొంచెం పెద్దగా కనిపించవచ్చని.. కాబట్టి ప్రియాంక చోప్రాణి ఎందుకురా బాబు.. అన్నట్లు అల్లు అర్జున్ అభిమాని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారిగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఒక క్యారెక్టర్‌కు జోడీగా ప్రియాంకను తీసుకోవాలని చూస్తున్నారట. అయితే ఆమె వయసు, లుక్ విషయాల్లో బన్నీకి సరిపోదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
అట్లీ ఈ నిర్ణయం తీసుకుంటే సినిమా మీదే ప్రభావం పడొచ్చని ఎంతోమంది వాపోతున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే ఇటువంటి వార్తలు రావడం కొంతవరకు నిరాశకు గురి చేస్తున్న.. అట్లీ దక్షకత్వంలో అల్లు అర్జున్ సినిమా కావడంతో.. మరోపక్క సినిమాపై అంచనాలు పెరుగుతునేన్నాయి.
ఈ క్రమంలో ఇప్పటివరకు ప్రియాంక చోప్రా గురించి..చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో అసంతృప్తి పెరిగింది. అల్లు అర్జున్‌కు సరిపోయే, యువతను ఆకట్టుకునే హీరోయిన్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో కూడా కీలకపాత్రలో కనిపించనుంది. మరి ఈ క్రమ అల్లు అర్జున్ సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అట్లీ ఈ జోడిని నిజంగా ఫైనల్ చేస్తాడా? అన్నది అధికారిక ప్రకటనలోనే క్లారిటీ వస్తుంది.
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









