Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన ఖ్యాతి, హాలీవుడ్ మేగజైన్ కవర్ పేజిపై బన్నీ ఫోటో

Allu Arjun: అల్లు అర్జున్ అభిమానులకు గ్రేట్ న్యూస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలకు పాకింది. ప్రముఖ హాలీవుడ్ మేగజీన్ కవర్ పేజ్‌పై బన్నీ ఫోటో ముద్రించడం సంచలనంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 20, 2025, 12:30 PM IST
Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన ఖ్యాతి, హాలీవుడ్ మేగజైన్ కవర్ పేజిపై బన్నీ ఫోటో

Allu Arjun: గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన అల్లు అర్జున్ సుకుమార్ సినిమా పుష్ప 2 బాక్సాఫీసులో సరికొత్త రికార్డు సృష్టించింది. సూపర్ డూపర్ హిట్ కొట్టింది. మరోవైపు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా పెద్దఎత్తున స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు బన్నీ మరో అరుదైన ఘనత సాధించారు. 

Add Zee News as a Preferred Source

ఐకాన్ స్టాల్ అల్లు అర్జున్ అభిమానులకు మేజర్ గుడ్ న్యూస్ ఇది. పుష్ప 2 భారీ విజయంతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బన్నీకు ఇప్పుడు మరో గుర్తింపు లభించింది. ప్రముఖ హాలీవుడ్ మేగజీన్ ది హాలీవుడ్ రిపోర్టర్ మేగజీన్ కవర్ పేజ్‌పై బన్నీ ఫోటో ముద్రితమైంది. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేరుతో ఈ మేగజీన్ ఇండియాలో ఎంట్రీ ఇచ్చింది. తొలి సంచిక కవర్ పేజ్ అల్లు అర్జున్‌దే కావడం విశేషం. అల్లు అర్జున్ ది రూల్ అంటూ ప్రాచుర్యం కల్పించారు. 

అంతేకాకుండా ఇదే మేగజీన్ టీమ్ అల్లు అర్జున్‌పై ఓ ఫోటో షూట్ కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను బిహైండ్స్ సీన్స్ పేరుతో విడుదల చేశారు. ఇండియన్ బాక్సాఫీసులో పెద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాను. నా జీవితంలో లభించిన అతి పెద్ద అవకాశం ఇదేనని భావిస్తున్నా..బలం, ఆత్మ విశ్వాసం మనసులో ఉండేవి. ఎవరూ వాటిని తొలగించలేరు. కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తాయి. ఇది అలాంటిదే. విజయం తరువాత కూడా వినయంగా ఉండటం ముఖ్యం అని అల్లు అర్జున్ హాలీవుడ్ రిపోర్టర్ ఇంటర్వూలో పేర్కొన్నాడు. జీవితంలో విజయం తరువాత కూడా ఎలాంటి గర్వం లేనివారిని చాలా మందిని చూశానని, అది వారి వారి వ్యక్తిత్వం గొప్పతనమన్నాడు. తాను కూడా నూటికి నూరు శాతం సామాన్యుడేనన్నారు. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయకపోవడాన్ని ఇష్టపడతానన్నాడు. కనీసం పుస్తకం కూడా చదవనని చెప్పాడు.

అల్లు అర్జున్ ది రూల్ పేరుతో హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజీన్‌లో ఆర్టికల్ ప్రచురితమైంది. ఇందులో అల్లు అర్జున్ ఇంటర్వ్యూ పూర్తి సారాంశం ఉంది. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 బాక్సాఫీసు వద్ద 1871 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిగా మందన్నా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగపతి బాబు తదితరులు నటించారు.

Also read: TG EAPCET 2025 Dates: తెలంగాణ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News