Allu Arjun: కొంపముంచిన అల్లు అర్జున్ అతి నమ్మకం..!

Allu Arjun over confidence: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప 2`తో భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆయన కెరీర్‌లో కొన్ని డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. వాటిలో `వరుడు ఒకటి. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది? అసలు సమస్య ఏమిటి? అన్న విషయాన్ని ఈ మధ్యనే ఈ సినిమా రైటెర్ తెలియచేశారు. 

Written by - Vishnupriya | Last Updated : Mar 16, 2025, 04:11 PM IST
Allu Arjun: కొంపముంచిన అల్లు అర్జున్ అతి నమ్మకం..!

Allu Arjun disaster movie: గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన వరుడు సినిమాలో అల్లు అర్జున్‌ సరసన భాను శ్రీ మెహ్రా నటించింది. విలన్‌గా ఆర్య కనిపించాడు. ఐదు రోజుల పెళ్లి వేడుక నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే, చిత్రబృందం హీరోయిన్‌ను చివరి వరకూ చూపించకుండా సస్పెన్స్‌ క్రియేట్ చేసింది. దీనివల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగినా, సినిమా విడుదలైన తర్వాత అదే పెద్ద తప్పుగా మారింది.  

Add Zee News as a Preferred Source

అల్లు అర్జున్‌ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా, సెకండాఫ్‌ బాగా వర్కౌట్ అవుతుందని భావించారు. కథ ప్రకారం, పెళ్లి సమయంలోనే హీరోయిన్‌ను విలన్‌ ఎత్తుకెళ్లిపోతాడు. దీంతో హీరో విలన్‌ను వెంబడించి పోరాటం సాగిస్తాడు. కానీ, ప్రేక్షకులు మాత్రం పెళ్లి వేడుక ఎలాగుంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురు చూశారు. అనుకున్న విధంగా సాగకపోవడంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు.  

హీరోయిన్‌ను చివరి వరకూ చూపించకపోవడం సినిమాకు ప్రతికూలంగా మారింది. ప్రేక్షకులు ఆమె గ్లామర్‌ను హైలైట్‌గా చూడాలనుకున్నారు. కానీ భాను శ్రీ మెహ్రా అందరినీ ఆకట్టుకునేలా లేకపోవడంతో ప్రేక్షకుల్లో నిరాశ పెరిగింది. ఈ విషయాన్ని తోట ప్రసాద్‌ కూడా తన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.  

సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే దర్శకుడు గుణశేఖర్‌ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్న విషయం గ్రహించినప్పటికీ, మార్పులు చేయలేకపోయారంట. అందుకు ముఖ్య కారణం నమ్మకమే అని.. అల్లు అర్జున్ ఈ సినిమా సెకండ్ హాఫ్ తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్న నమ్మకం పెట్టుకున్నారని తెలియజేశారు. అయితే ప్రేక్షకుల అంచనాలు, దర్శకుడి చూపించిన విధానం ఒక్కటిగా లేకపోవడంతో వరుడు సినిమా 2010 మార్చి 31న విడుదలై భారీ పరాజయం మూటగట్టుకుంది.  

అల్లు అర్జున్‌ కెరీర్‌లో ఇది మొదటి పెద్ద పరాజయం. అభిమానులు, సినీ విమర్శకులు కూడా ఈ సినిమాపై మిశ్రమ స్పందన ఇచ్చారు. మొత్తం పైన అల్లు అర్జున్ అతిగా పెట్టుకున్న నమ్మకం కాస్త కొంపముంచింది.

Also read: Actor Vijay Warning: పవన్..నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News