Allu Arjun about Chiranjeevi: 2025 మే 1న ముంబైలో నిర్వహించబడిన 'వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్' (వేవ్స్) ప్రారంభోత్సవం ప్రత్యేకంగా జరిగింది. ఈ సదస్సును.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. 90కి పైగా దేశాల నుంచి పదివేలకు పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్టప్‌లు పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ వంటి భారత సినిమా పరిశ్రమల ప్రముఖులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సదస్సులో టీవీ9 ఎండీ, సీఈఓ బరుణ్ దాస్, టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా, అల్లు అర్జున్ తన వ్యక్తిగత జీవితం, వృత్తి పరమైన అనుభవాలు పంచుకున్నారు. ఆయన ప్రధానంగా తన ఫిట్‌నెస్ గూర్చి మాట్లాడారు. "ఫిట్‌నెస్‌కు నా మానసిక ప్రశాంతతే ప్రధాన కారణం," అని బన్నీ చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత మాట్లాడుతూ, "మా తాత అల్లు రామలింగయ్య 1000 సినిమాల్లో నటించారు. మా తండ్రి అల్లు అరవింద్ 70 సినిమాలు నిర్మించారు. మా మామ చిరంజీవిది సౌత్ లో సూపర్ స్టార్ ఫ్యామిలీ. నేను ఫ్యాన్స్ సపోర్ట్‌తో ఈ స్థాయికి వచ్చా. పుష్ప సినిమాతో నాకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది,” అని చెప్పుకొచ్చారు.
ఆ తరువాత ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ..” ప్రతి నటుడికి ఫిట్‌నెస్ అనేది చాలా ముఖ్యం. షూటింగ్‌లో లేనప్పుడు కూడా నాకు ఫిట్‌నెస్ చాలా ప్రధానంగా భావిస్తాను. నాకు సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదు. షూటింగ్ లేకపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను. ఇక సినిమాల్లో సిక్స్ ప్యాక్ కోసం చాలా కృషి చేశాను,” అని చెప్పుకొచ్చారు.
అయితే గత కొద్దిరోజులగా మెగా ఫాన్స్ మధ్య అల్లు ఫాన్స్ మధ్య చిన్న వార్ నడుస్తున్న క్రమంలో.. మా మామ చిరంజీవి అని అల్లు అర్జున్ ప్రత్యేకంగా చెప్పడంతో.. చాలామంది ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. అయితే వెంటనే నా ఫ్యాన్స్ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను అనే ఒక లైన్ ఆడ్ చేయడంతో.. మరి కొంతమంది మాత్రం ఇంకా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ పట్ల కొంత పొగరుగానే ప్రవర్తిస్తున్నారు అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
Also read: NEET UG 2025: నీట్ యూజీ పరీక్షలో మల్టీ లెవెల్ చెకింగ్, తేడా జరిగితే అంతే సంగతులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్- https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









