Pushpa 2 Telugu Collections: అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప 2’ మూవీ తెలుగులోనే కాదు హిందీలో పలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాదు బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ మూవీల తర్వాత తెలుగు నుంచి రూ. వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించిన నాల్గో సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా లాస్ట్ ఇయర్ విడుదలై పలు రికార్డుల బెండు తీసింది. ముఖ్యంగా ఈ చిత్రం తెలుగులో కంటే నార్త్ లోనే దిమ్మ దిరిగే వసూళ్లను రాబట్టింది. అంతేకాదు బాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డు నమోదు చేసింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్.. వచ్చిన వసూళ్ల విషయానికొస్తే.. పుష్ప 2 విడుదలైన రోజు నుంచ రికార్డుల జాతర మొదలు పెట్టింది. తొలి రోజే ఈ మూవీ దాదాపు రూ. 296 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము రేపింది. మన దేశంలో మొదటి ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిన చిత్రం మరేది లేదు. దీనికంటే ముందు ఆర్ఆర్ఆర్ మూవీ రూ. 236 కోట్ల గ్రాస్ వసూల్లతో నెంబర్ వన్ ప్లేస్ లో ఉండే.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 213 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓ రకంగా సెన్సేషన్ స్టార్ట్ అని చెప్పాలి. రూ. 215 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా మొత్తంగా అన్ని ఏరియాల్లో రికార్డు బ్రేక్ బిజినెస్ చేసింది. తర్వాత కాస్త నెమ్మదించినా ఓవరాల్ గా డీసెంట్ వసూళ్లను రాబట్టింది. తెలుగు సినిమాకు రూ 213 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఆషామాషీ కాదు. కానీ దాన్ని ఈజీగా క్రాస్ చేయడం చెప్పుకోదగ్గ విషయం అని చెప్పాలి.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. ఈ సినిమా తెలంగాణ రాష్ట్రంలో రూ. 104.70 కోట్ల షేర్ రాబట్టి.. ఆర్ఆర్ఆర్ తర్వాత రూ. 100 కోట్లకు పైగా షేర్ ను అందుకున్న రెండో చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఇక రాయలసీమలో రూ. 35.70 కోట్ల షేర్ అందుకుంటే.. మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ లో కలిపి రూ. 86.85 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే.. రూ. 226.92 కోట్ల షేర్ (రూ. 346.70 కోట్ల గ్రాస్) వసూల్లను రాబట్టి ప్రీ రిలీజ్ బిజినెస్ పై రూ. 11.92 కోట్ల లాభాలను తీసుకొచ్చి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ఏపీలో పలు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేదు. అప్పట్లో పుష్ప 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి కాలేదు. కానీ హిందీలో హిట్ గా నిలవడంతో ఓవరాల్ గా హిట్ గా నిలిచింది.
ఇక పుష్ప 2 మూవీ హిందీలో రూ. 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 202 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప 2.. ఓవరాల్ గా రూ. రూ. 388 కోట్ల షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అక్కడ రూ 200 కోట్లకు పైగా లాభాలతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది పుష్ప 2.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









