Allu Arjun Regret: అల్లు అరవింద కొడుకుగా సినిమా ఇండస్ట్రీలో..ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఆ తర్వాత తన స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగారు. పుష్ప తో పాన్ ఇండియా.. బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరోకి.. ఇప్పటికీ కూడా ఒక సినిమా మీద కోరిక ఇంకా పోలేదట. అలాంటి సినిమా చేయాలి అనేది అల్లు అర్జున్ కోరికంట. ఇంతకీ ఆ సినిమా ఏదో చూద్దాం..
అల్లు అర్జున్ మొదటి చిత్రం గంగోత్రి మంచి విజయాన్ని సాధించినా..ఆయనను స్టార్ హీరోగా నిలబెట్టలేదు. అదే సమయంలో, రవితేజ నటించిన ఇడియట్ చిత్రం యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాని చూసిన బన్నీ, "ఇలాంటి సినిమా నాకు ఎందుకు రాలేదబ్బా?" అంటూ బాధపడ్డాడట. "ఇది లాంటి యూత్‌ఫుల్ సినిమాతోనే పెద్ద స్టార్ అవ్వొచ్చు" అనే ఆలోచనలో పడిపోయాడు. ఆ సినిమాలు రవితేజ గొప్ప నీటిని.. ఆ సినిమా ఘనవిజయం మొత్తానికి అల్లు అర్జున్ ని అసూయపడేలా చేసిందంట. అందుకే అలాంటి సినిమా ఎలా అయినా చేయాలి అనుకున్నారట.
ఇడియట్ తరహా సినిమా కోసం ఎదురు చూస్తున్న అల్లు అర్జున్‌కు, దర్శకుడు సుకుమార్ "ఆర్య" కథను చెప్పాడు. కానీ "ఇడియట్" కంటే భిన్నంగా ఉండటంతో మొదటిసారి బన్నీకి ఆసక్తి కలిగినా, దర్శకుడు కొత్తవాడు కావడంతో అనుమానం కలిగిందట. అయితే, ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఇచ్చిన ధైర్యంతో బన్నీ ఆ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
"ఆర్య" విడుదల రోజున 40% ఆక్యుపెన్సీతో ప్రారంభమైంది. అప్పుడు అల్లు అర్జున్ ఇండస్ట్రీకి కొత్తగా ఉండటంతో సినిమా పెద్దగా వసూళ్లు సాధించలేదని భావించారు. కానీ, సినిమా చూసిన ప్రేక్షకులు విపరీతంగా మెచ్చుకోవడంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు "సినిమా 10 వారాలపాటు ఆడుతుంది" అని అంచనా వేశారు. అయితే, ఇది కూడా బన్నీకి అసంతృప్తిగా అనిపించిందంట.
ఈ విషయాన్ని ఇంట్లో చర్చించుకున్న బన్నీ, "ఇది కచ్చితంగా 125 రోజులు ఆడుతుంది" అని తన తండ్రి అల్లు అరవింద్‌కు చెప్పారు. అంతే కాకుండా, "ఈ సినిమా 125 డేస్ షీల్డ్ చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకుంటాను" అని సవాలు విసిరాడంట. బన్నీ చెప్పినట్టుగానే, "ఆర్య" 125 రోజులు సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని జరిగిన వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బన్నీ 125 డేస్ షీల్డ్ అందుకోవడం విశేషం.
ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌ను మలుపుతిప్పింది. "ఆర్య" వల్ల ఆయన యూత్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగినప్పటికీ, "ఇడియట్" తరహా సినిమా తనకు రాలేదన్న అసంతృప్తి మాత్రం ఇప్పటికీ మిగిలే ఉంది అని ఈ మధ్య ఒక ఈవెంట్ లో తెలిపారు అల్లు అర్జున్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









