Allu Arjun Wedding Anniversary: ఘనంగా అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల 14th వెడ్డింగ్ యానివర్సరీ.. కేక్ కట్ చేసిన దంపతులు..

Allu Arjun Sneha Reddy 14th Wedding Anniversary: అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల 14వ వివాహా వార్షికోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 7, 2025, 12:00 AM IST
Allu Arjun Wedding Anniversary: ఘనంగా అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల 14th వెడ్డింగ్ యానివర్సరీ.. కేక్ కట్  చేసిన దంపతులు..

Allu Arjun Sneha Reddy 14th Wedding Anniversary: టాలీవుడ్ లో అత్యంత క్యూట్ జంటల్లో అల్లు అర్జున్, స్నేహారెడ్డిలు ఒకరు. కులాలు వేరు అయినా.. వీళ్లిద్దరు ప్రేమించి పెద్దలను ఒప్పించి  పెళ్లి చేసుకున్నారు. మార్చి 6న అల్లు అర్జున్, స్నేహారెడ్డిలు 14వ వివాహా వార్షికోత్సవాన్ని కేక్ కట్ చేసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అని కొందరు అంటారు. అందులో అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలు చూస్తే.. వీళ్లిద్దరు ఒకరి కోసం మరొకరు పుట్టారేమో అనిపిస్తోంది. దేవుడు రాసిపెడతాడు.. ఇక అప్పుడు  ఆరు నూరైన ఆ బంధం ఒక్కటవుతుంది. ఆయన ఆశ్శీస్సులతో వాళ్ల ప్రయాణం ఎంతో సజావుగా..నలుగురికి ఆదర్శంగా కొనసాగుతుంది. ఇతరులు అసూయ పడే అప్యాయతల నడుమ, అన్యోన్యంగా వారి వివాహా బంధం కొనసాగుతుంది.

Add Zee News as a Preferred Source

సరిగ్గా అలాంటి 'అల్లు'కున్న 'స్నేహా' బంధం... ప్రేమబంధం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, స్నేహారెడ్డిల భార్యాభర్తల అనుబంధం తాజాగా 14 యేళ్లు పూర్తైయింది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఈ జంట ప్రేమించి వివాహాం చేసుకున్నారు.  ఈ జంట మార్చి 6న  14వ పెళ్లి రోజు జరుపుకున్నారు.  ఈ రోజు అల్లు అర్జున్‌ ఐకాన్‌స్టార్‌గా, ప్రపంచ ప్రఖ్యాతి పొందటంలో, భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన  హీరోగా నిలవడంలో తెర వెనక ఆయన భార్య స్నేహా రెడ్డి సపోర్ట్‌ మరువలేనిది.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.             

ఆమె ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పొచ్చు. ప్రతి విషయంలో అల్లు అర్జున్, స్నేహారెడ్డిలు  ఎంతో అండర్‌స్టాండింగ్‌తో ముందుకెళుతున్నారు. అంతేకాదు ఫ్యామిలీకి టైమ్‌ను కేటాయించడంలో, పిల్లల ఆలనా పాలనాలో ఇద్దరుది ఒకే మాట.  సినిమాతో పాటు వ్యక్తిగత జీవితానికి టైమ్ కేటాయిస్తూ రెండింటికి సమ ప్రాధాన్యత ఇస్తున్నారు.  మొత్తంగా 14వ వివాహా వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలియజేసారు. అల్లు అర్జున్ విషయానికొస్తే.. పుష్ప 2 తర్వాత.. త్రివిక్రమ్, అట్లీలతో సినిమాలు చేయబోతున్నాడు. త్వరలో ఈ సినిమాలు పట్టాలెక్కనున్నాయి. 

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News