Pushpa 3 Update: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్-రష్మిక మందన్నా నటీ నటులుగా తెరకెక్కిన పుష్ప2 ది రూల్ సాధించిన హిట్ అంతా ఇంతా కాదు. అన్ని రికార్డుల్ని చెరిపేసి 1840 కోట్ల కలెక్షన్లతో తుపాను రేపింది. అదే సమయంలో హైదరాబాద్ థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ వంటి పరిణామాలతో మరింత చర్చనీయాంశమైంది.
2021లో విడుదలైన పుష్ప ది రైజ్ సూపర్ హిట్ అనుకుంటే దాదాపు నాలుగేళ్ల తరువాత విడుదలైన పుష్ప 2 ది రూల్ అన్ని రికార్డుల్ని చెరిపేసింది. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీసులో కలెక్షన్ల వర్షం కురిపించింది. పుష్ప 1లో ఊ అంటావా మామ పాటతో సమంత కిక్ ఎక్కిస్తే పుష్ప 2లో శ్రీలీల కిస్సిక్ అంటూ మత్తెక్కించింది. పుష్ప 2 సినిమా పుష్పరాజ్‌పై బాంబు దాడితో ముగించి పుష్ప 3 ది ర్యాంపేజ్ అంటూ దర్శకుడు సుకుమార్ ఉత్కంఠ రేపారు. అయితే పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన కొన్ని అనివార్య సంఘటనలు పుష్ప 3 ఉండదేమోననే సందేహాల్ని రేపింది. అల్లు అర్జున్ అభిమానులు ఈ సందిగ్దతలో ఉండగా పుష్ప నిర్మాత రవిశంకర్ పుష్ప 3 గురించి కీలకమైన అప్‌డేట్ ఇచ్చాడు. పుష్ప 3 ర్యాంపేజ్ విడుదల ఎప్పుడనేది చెప్పేశాడు.
ప్రస్తుతం ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా పూర్తయ్యాక పుష్ప 3 షూటింగ్ ఉంటుందని రవి శంకర్ వెల్లడించారు. పుష్ప 3 సినిమాను 2028లో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాత రవిశంకర్ నితిన్ సినిమా రాబిన్ హుడ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. పుష్ప 3 విడుదల సంవత్సరం ప్రకటించడంతో ఇక అభిమానులు కౌంట్ డౌన్ ప్రారంభించేశారు. ర్యాంపేజ్ ఎలా ర్యాంప్ ఆడిస్తుందనే ఊహాగానాల్లో మునిగిపోయారు.
Also read: Rashmika Mandanna: కోపంగా ఉంటారు.. నేను అది అతనికి చెప్పే చేశాను: విజయ్ దేవరకొండ గురించి రష్మిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









