)
Pawan Kalyan Meets Allu Arjun: దివంగత హాస్యనటులు అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణలతో కనకరత్నమ్మ మృతి చెందగా.. టాలీవుడ్ పరిశ్రమలో చాలా మంది అల్లు అర్జున్ ఇంటికి పరామర్శకు వెళ్లారు. చిత్రసీమలో చాలా మంది డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలతో పాటు అనేక రకాల టెక్నిషియన్స్ ఆమె చివరి చూపుకు వెళ్లారు. మెగా ఫ్యామిలీ కూడా అల్లు వారి ఇంటికి తరలివెళ్లింది.
అయితే వైజాగ్ లో పబ్లిక్ మీటింగ్ కారణంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అల్లు కనకరత్నమ్మ కడసారి చూపుకు నోచుకోలేకపోయారు. అయితే ఆ మీటింగ్ పూర్తవ్వగానే పవన్ కల్యాణ్ హైదరాబాద్ వచ్చారు. అల్లు వారి ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్.. అల్లు అరవింద్, అల్లు అర్జున్‌తో పాటు వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అల్లు అర్జున్ ను ఓదార్చిన ఉపముఖ్యమంత్రి.. వారికి ధైర్యం చెప్పారు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విశాఖపట్నంలో మీటింగ్ ముగించుకుని హైదరాబాద్‌లో అల్లు వారి ఇంటికి చేరుకున్న పవన్ కల్యాణ్.. వారిని ఓదార్చారు. మరోవైపు అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు ముగిశాక.. ఆమె కళ్లు దానం చేసినట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ఓ ప్రెస్ మీటింగ్ లో ప్రస్తావించారు.
ఏం జరిగింది?
దివంగత అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ వార్త అటు అల్లు కుటుంబంతో పాటు మెగా ఫ్యామిలీలో విషాదం నింపింది.
అదే రోజు మధ్యాహ్నం కోకాపేటలో జరిగిన అల్లు కనకరత్నం అంత్యక్రియల్లో పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా ఆమె అల్లుడైన మెగాస్టార్ చిరంజీవి, మనవడు అల్లు అర్జున్ ఆమె పాడె మోశారు. కనకరత్నం కొడుకు అల్లు అరవింత్ విషాద హృదయంతో కుండని మోస్తూ కనిపించారు. చిరంజీవి, అల్లు అర్జున్‌తో పాటు రామ్ చరణ్, అల్లు అయాన్ కూడా ఆమె పాడె మోశారు. అల్లు కనకరత్నం కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు తరలివచ్చారు. అంతటి విషాదకర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook