Amaran OTT: అమరన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే..?

Amaran OTT release date:  శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. 

Written by - Vishnupriya | Last Updated : Nov 30, 2024, 05:01 PM IST
Amaran OTT:  అమరన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే..?

Amaran OTT date: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన చిత్రం అమరన్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కించారు. ఈ సినిమా మొదటి షోతోనే మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సంపాదించుకున్నది. 

Add Zee News as a Preferred Source

ఇదిలా ఉండగా మరోవైపు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఎట్టకేలకు చిత్ర బృందం ఓటిటి అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన అమరన్ సినిమా అన్ని భాషలలో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. 

సుమారుగా ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది ఈ సినిమా. ఇప్పుడు  డిజిటల్ స్ట్రీమింగ్ కి  సిద్ధమయ్యింది. డిసెంబర్ 5వ తేదీన తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ,  హిందీ వంటి భాషలలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైనట్లు చిత్ర బృందం అధికారికంగా తెలియజేసింది. 

దీపావళి కానుకగా రిలీజ్ అయిన అమరన్ సినిమా థియేటర్లో విడుదలై 35 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతున్నట్లు తెలుస్తోంది.  ఓటీటీ లో రిలీజ్ అయిన అమరన్ సినిమా అటు కేరళ ,తమిళంలో మాత్రం 50 రోజులు థియేటర్లో ఉంచేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి ఎట్టకేలకు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర బృందం. ఈ సినిమాతో సాయి పల్లవి నటన హైలెట్గా నిలిచిందని శివ కార్తికేయన్ కూడా అద్భుతంగా నటించారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్, ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి లీనమై నటించారని చెప్పవచ్చు.

ఇదీ చదవండి:  Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..

ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News