Amaravathi ki Aahwaanam: ప్రస్తుత కాలంలో హార‌్రర్ థ్రిల్లర్ సినిమాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ మధ్యే బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ సాధించిన ముంజ్య, స్త్రీ 2 సినిమాలే దానికి మంచి ఉదాహరణ. తాజాగా అలాంటి ఒక ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’. అక్కడొకడుంటాడు ఫేమ్ శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి టాలెంటెడ్ రైటర్, డెరెక్టర్ జివికె డైరెక్టర్ వహిస్తున్నారు.
ఉగాది సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. టైటిల్‌తోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని గమనిస్తే..లీడ్ యాక్టర్స్ అందరూ బ్లాక్ డ్రెస్ వేసుకుని సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ముఖాలు పూర్తిగా రివీల్ కానప్పటికీ అందరి కళ్లలో ఒకేరకమైన ఇంటెన్సిటీ కనిపిస్తోంది.
ఒక మంచి హారర్ థ్రిల్లర్ చిత్రానికి కావాల్సిన మూడ్ పూర్తిగా క్యారీ అయిందనే చెప్పాలి. క్రియేటివ్‌గా ఉన్న ఫస్ట్ పోస్టర్ తోనే సినిమా ఎలా ఉండబోతుంది అనే హింట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జే ప్రభాకర్‌రెడ్డి సినిమాటోగ్రాఫీ అందించారు. పద్మనాభన్ భరద్వాజ్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా సాయిబాబు తలారి ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ అంజీ మాస్టర్ కంపోజ్ చేశారు. త్వరలో ఈ మూవీ నుండి మరిన్ని సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్‌ను ప్లాన్ చేస్తోంది మూవీ యూనిట్. ఈ సినిమాలో శివ కంఠంనేని తో పాటు ఎస్తేర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, అశోక్ కుమార్, హరీష్, భద్ర్, జెమినీ సురేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









