)
Anasuya Ari Movie: ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్ల వైపు రావడం చాలా వరకు తగ్గించేశారు. సినిమా టాక్ మరీ బాగుంటే థియేటర్.. యావరేజ్‌గా ఉంటే ఓటీటీ.. లేదంటే లైట్ తీసుకుంటున్నారు. ఓ సినిమా థియేటర్లో ఓ వారం ఆడితే చాలు అనుకునే పరిస్థితికి వచ్చేసింది. పెద్ద సినిమాలు కూడా వీకెండ్లోనే ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించగలుగుతున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే గానీ.. ఓ రెండు వారాలు థియేటర్స్‌లో ఆడడం లేదు. అయితే అనసూయ అరి మూవీ మాత్రం తన హవాను కంటిన్యూ చేస్తోంది. రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ మూవీ.. ఈ దీపావళికి వచ్చిన నాలుగు సినిమాలకు గట్టి పోటీ ఇచ్చేలా దూసుకువెళుతోంది.
ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ అయిన అరి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినిమా మెల్లగా మరింత పికప్ అవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త సినిమాలకు గట్టి పోటీ ఇచ్చేలా థియేటర్లో ఆడియన్స్‌తో నిండిపోతుందని మేకర్స్ చెబుతున్నారు. విడుదలైన పది రోజుల తరువాత కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని డైరెక్టర్ జయ శంకర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అరి సినిమా 10వ రోజు RTC X రోడ్స్ సప్తగిరిలో చూడటం ఎంతటి చిరస్మరణీయమైన భావోద్వేగ క్షణం అంటూ ఆయన ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రేమ, సపోర్ట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆడియన్స్ ప్రోత్సాహం తమను ముందుకు నడిపిస్తుందని. ఈ ప్రయాణం నిజంగా ప్రత్యేకమైనదంటూ చెప్పుకొచ్చారు.
కంటెంట్ బెస్డ్ మూవీ కావడం.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో రెండో వారం కూడా కంటిన్యూ చేసేందుకు మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అయితే ఈ మూవీ కోసం ఆర్టిస్టులంతా కలిసి వచ్చి ప్రమోషన్స్‌లో పాల్గొని ఉంటే.. మరో లెవెల్లో ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పేపర్ బాయ్ వంటి సెన్సిబుల్ లవ్ స్టోరీతో తొలి హిట్ అందుకున్న డైరెక్టర్ జయ శంకర్.. తాజాగా అరి మూవీతో మరోసారి ఆకట్టుకున్నారు. అరి షడ్వర్గాల కాన్సెప్ట్‌ను తీసుకుని.. మంచి సందేశాన్ని ఇస్తూ చక్కగా రూపొందించారు. వరుసగా రెండు కంటెంట్ బేస్డ్ సినిమాలు తీసిన జయ శంకర్ మూడో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook