Anasuya Bharadwaj Reacts Middle Finger: హోలీ పండుగలో ఒకరికి మిడిల్ ఫింగర్ చూపించడంపై యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అగౌరవపరచాలనుకున్న వ్యక్తి.. నా వయసుపై అతడు చేసిన వ్యాఖ్యలకు అదే రీతిలో బుద్ధి చెప్పాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. తాను చేసింది తప్పు కాదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. పరస్పరం గౌరవించుకోవాలని.. కానీ అలా చేయడం తప్పని అనసూయ వ్యాఖ్యానించడంతో మరోసారి నెట్టింట్లో చర్చ జరుగుతోంది.
Also Read: Anchor Shyamala: బెట్టింగ్ యాప్ కేసులో పోలీస్ స్టేషన్ కు హాజరైన యాంకర్ శ్యామల..
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ సోమవారం సాయంత్రం నెటిజన్లతో చిట్‌చాట్ చేశారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలు.. వారి కామెంట్లకు స్పందిస్తూ అనసూయ రిప్లయి ఇచ్చారు. తన సౌందర్య రక్షణ, షూటింగ్ లు, తన చీరల సేకరణపై స్పందించారు. ఈ సందర్భంగా హోలీ పండుగ సమయంలో 'మిడిల్ ఫింగర్' చూపించిన విషయాన్ని ఓ నెటిజన్ ప్రస్తావించారు. తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో.. ఏం జరిగిందో అనసూయ వివరణ ఇచ్చారు.
Also Read: Kannappa:‘కన్నప్ప’ ప్రయాణంతో పూర్తిగా శివ భక్తుడిగా మారిపోయాను.. మంచు విష్ణు ఎమోషనల్ కామెంట్స్..
'నాకు కోపం రాలేదు. ఇది అగౌరపరిచిన సంఘటన. కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. కామెంట్ల రూపంలో ముక్కు మొహం తెలియకుండా ఏదైనా టైప్ చేయడం.. ఏదైనా మాట్లాడడం ఒక ఎత్తు. నా ఎదురుగా ఉండి నా ముఖం మీద.. నన్ను ఏజ్ షేమ్ చేయాలనుకున్న.. నన్ను అగౌరవపరచాలనుకున్న వారికి అట్లా చెప్పాల్సి వచ్చింది. నేనే కాదు ఎవరు ఏ అమ్మాయిని.. ఏ వ్యక్తి అయినా ఇది తప్పు కాదని చెప్పాలని అనుకున్నా అంతే. అలా చేయడం తప్పని చెప్పడం నా ఉద్దేశం. పైకి వస్తే ఏం చేసేదానిని అంటే ఏం జరిగేది మీ ఊహకే వదిలేస్తున్నా.
మరో వీడియోలో అనసూయ స్పందిస్తూ. 'ఎవరికీ ఏ భాషలో అర్థమవుతుందో ఆ భాషలోనే చెప్పాలి. నేను అదే చేస్తున్నా. ఇది ట్రూ వే ట్రాఫిక్ బ్రో' అని చెప్పిన అనసూయ తన భర్త మాతృ భాష మైతిలీలో మరో సూచనలు చేశారు. 'మీరు చెప్పేది నిజమే అయ్యిండొచ్చు. కానీ ఒకరితో పరస్పరం గౌరవించుకోవాల్సి ఉంది' అని నెటిజన్‌కు అనసూయ కౌంటర్ ఇచ్చారు. ఇక నెటిజన్లు అడిగిన మిగతా అంశాలపై అనసూయ స్పందించారు. తన చీరలు.. అందం.. వేసవికాలం చర్మ సౌందర్య రక్షణ తదితర అంశాలపై తనకు తోచిన అభిప్రాయాన్ని అనసూయ పంచుకున్నారు.
అనసూయ మాట్లాడిన వీడియోలు ఇవే!
https://www.instagram.com/stories/itsme_anasuya/3595345865868868584/
https://www.instagram.com/stories/itsme_anasuya/3595374369369102517/
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









