Telugu Anchor: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు ఫేమస్ యాంకర్.. ఏకంగా 108 కేజీలు..!

Sreemukhi : వెండితెర.. పైన కానీ బుల్లితెర పైన కానీ రానించాలి అంటూ.. తప్పకుండా బరువు అదుపులో ఉండాలి అని కొంతమంది నమ్ముతారు. అయితే మరి కొంతమంది మాత్రం ఎలా ఉన్నా కానీ.. తమన ద్వారా ఆకట్టుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు.. ఈ క్రమంలో ఒక యాంకర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 11, 2025, 04:58 PM IST
Telugu Anchor: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు ఫేమస్ యాంకర్.. ఏకంగా 108 కేజీలు..!

Sreemukhi Weight Loss Journey : ప్రముఖ యాంకర్ శ్రీముఖి తన కెరీర్‌లో ఎన్నో షోలను హోస్ట్ చేసి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ముఖ్యంగా ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ కార్యక్రమం ద్వారా ఆమె ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఎంతో దగ్గరయ్యింది. తాజాగా ఈ షోలో వచ్చిన ప్రోమోలో శ్రీముఖి పాత ఫొటోలు చూపించడంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ ప్రోమోలో అవినాష్, హరి, రోహిణి తదితరులు శ్రీముఖితో సరదాగా మాట్లాడుతూ ఆమె చిన్నప్పటి ఫొటోలు చూపించారు. అందులో ఓ ఫొటో చూసినవారంతా ఆశ్చర్యపోయారు. 

అందుకు ముఖ్య కారణం అసలు ఆ ఫోటోలో ఉండేది శ్రీముఖి నా కాదా అని ప్రతి ఒక్కరికి అనుమానం రావద్దు. ఈ ఫోటోలలో ఎంతో లావుగా.. కనిపించింది  శ్రీముఖి.

అక్కడ ఉన్న వారందరూ కూడా ‘ఇది నిజంగా నువ్వేనా?’ అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన శ్రీముఖి, “ఇది నా పదో తరగతి ఫొటో. అప్పట్లో నేను చాలా తింటూ ఉండేదాన్ని. రెండు బిర్యానీ ప్యాకెట్లు తినేదాన్ని. అంత తిన్నాను కాబట్టి నా బరువు 108 కిలోలవరకూ వెళ్లింది. నడవడం కూడా కష్టంగా ఉండేది,” అని చెప్పింది. ఆమె మాటలు వినగానే అక్కడ ఉన్నవాళ్లు ఆశ్చర్యపోయారు.

శ్రీముఖి ఇప్పుడు స్లిమ్‌గా మారడానికి తాను ఎంత కష్టపడ్డానో తెలియజేసింది. ఇక ఇది విన్న అభిమానులు బరువు తగ్గడానికి శ్రీముఖి డెడికేషన్ కి.. ప్రశంసలు అందిస్తున్నారు.

కాగా ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో.. శ్రీముఖి హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులాయి చిత్రంతో ఈమె మంచి ఫేమ్ తెచ్చుకునింది. ఈ సినిమాలో ఈమె కనిపించేది కాసేపే ఆయన.. ఆ తర్వాత ఈ సినిమా వల్ల తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు అందుకుంది. 

అయితే వెండి తెర కన్నా కూడా.. బుల్లితెర షోల వల్ల ఈమెకు మరింత పాపులారిటీ వచ్చింది. జీ టీవీ, ఈ టీవీ, మాటీవీ.. ఇలా ఎన్నో పాపులర్ టీవీ చానల్స్ లోని షోలలో కనిపించి.. ఇప్పటికీ కూడా అందరినీ మెప్పిస్తోంది శ్రీముఖి. ఈ క్రమంలో ఈ నటికి సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి అని వినికిడి. అనసూయ లాంటి వారు ఇప్పటికే బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్లిన సంగతి తెలిసిందే. మరి వెండి తెర నుంచి బుల్లితెరకు వచ్చిన శ్రీముఖి మళ్ళీ వెండితెరకు వెళుతుందేమో చూడాలి.

Also read: India Pakistan Ceasefire: ట్రంప్ ఓ బ్రోకర్..విడిచిపెట్టేది లేదు, ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News