Pawan Kalyan Movies: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానుల్ని ఖుష్ చేసేందుకే అన్పిస్తోంది. ఎందుకంటే వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఏ ఒక్క సినిమా పూర్తి కాక, కాల్ షీట్స్ కేటాయించక ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలు రెండింటినీ నిర్వహించలేక ఇబ్బంది పడుతున్నట్టు అన్పిస్తోంది. ఉన్న సినిమాలకు కాల్ షీట్స్ ఇవ్వలేకపోవడంతో ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాలను వీలైనంతవరకు వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సనాతనం బాధ్యతలు తీసుకున్న తరువాత పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం కావల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో కాల్ షీట్స్ ఇచ్చేందుకు సమయం లేదు.
దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కొన్ని రోజుల షూటింగ్‌తో ఆగిపోయింది. తిరిగి ఎప్పుడు ప్రారంభమౌతుందో తెలియని పరిస్థితి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాల్సిన సినిమా ఇక మొదలయ్యే పరిస్థితి లేదు. ఈ సినిమాను హైదరాబాద్ నేపధ్యంతో మాఫియా కథాంశంగా తెరకెక్కించాలనుకున్నారు. అధికారికంగా సినిమా కూడా ప్రకటించారు. కానీ కాల్ షీట్స్ లేక ప్రారంభమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. ఈ సినిమాలను నిలిపివేయాలంటే డబ్బు లావాదేవీలు ముడిపడి ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చిన డబ్బులు సెటిల్ చేయాల్సి ఉంటుంది. దర్శకుడు, హీరోయిన్‌కు కూడా అడ్వాన్స్ చెల్లించారు. ఈ లెక్కలు సరి చేయాల్సి ఉంది.
ఇక హరిహర వీరమల్లు పార్ట్ 1 వరకూ ఓకే గానీ పార్ట్ 2 అనుమానమే. ఎందుకంటే పార్ట్ 1 పూర్తి చేసేందుకే సమయం సరిపోవడం లేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ సౌలభ్యం కోసమే ఈ సినిమాను దర్శకుడు రెండు భాగాలుగా ప్లాన్ చేశాడు. అయితే కాల్ షీట్లు లేకపోవడంతో ఇక రెండో భాగం పూర్తిగా అటకెక్కినట్టేనని తెలుస్తోంది. ప్రస్తుతం మొదటి భాగం 90 శాతం పూర్తయింది. మిగిలిన 10 శాతం పూర్తి చేసి విడుదల చేసి, ఓజీ సినిమా పూర్తి చేస్తే ఈ రెండే పవన్ కళ్యాణ్ ఆఖరి సినిమాలు కావచ్చు.
అయితే పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం వాస్తవానికి భిన్నంగా ఉన్నాయి. డబ్బు అవసరం ఉన్నంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తానని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









