)
BEAUTY Teaser: యూత్ ఫుల్ లవ్ స్టోరీకి ఆడియోన్స్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. ఈ స్టోరీ ఫాదర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ టచ్ ఇస్తూ కామెడీని మిక్స్ చేస్తూ అలరించేందుకు వచ్చేస్తోంది బ్యూటీ మూవీ. అంకిత్ కొయ్య, నీలఖి హీరోహీరోయిన్స్‌గా.. జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.
తాజాగా సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కన్నా.. మన పేరెంట్స్‌కి మన మీద ప్రపంచాన్నే కొని ఇచ్చేయాలన్నంత ప్రేమ ఉంటుంది.. అంటూ ఇంట్రెస్టింగ్ డైలాగ్‌తో టీజర్‌ను స్టార్ట్ చేశారు. ఆ ముఖాన్ని ఐస్ ముక్కల్లో పెట్టకుండా.. శుభ్రంగా పసుపు రాసుకోవచ్చు కదా.. అని హీరోయిన్ తల్లి చెప్పగా.. బ్యూటీని కన్నావ్ అమ్మా నువ్వు.. అంటూ హీరోయిన్ను టీజర్లో పరిచయం చేశారు. ఓ వైపు హీరోహీరోయిన్స్ మధ్య ప్రేమను చూపిస్తూ.. మరోవైపు మిడిల్ క్లాస్ కలలను చూపిస్తూ ఎమోషనల్‌గా చూపించారు. కూతురిపై తండ్రికి ఉండే ప్రేమను ఎలా ఉంటుందో చూపించారు. టీజర్ చివర్లో ఓ ఎమోషనల్ డైలాగ్‌తో సినిమాపై మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు. విజయ్ బుల్గానిన్ అందించిన ఆర్ఆర్ ప్రేక్షకుల మనసును హత్తుకునేలా ఉంది. శ్రీ సాయి కుమార్ దారా విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి.
ఆయ్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న అంకిత్ కొయ్య.. బ్యూటీ మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకునేలా ఉన్నారు. ఇక ఈ సినిమాలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
టెక్నీకల్ టీమ్:
==> స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: జె.ఎస్.ఎస్. వర్ధన్
==> నిర్మాతలు: అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్
==> బ్యానర్లు: వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్, మారుతీ టీమ్ ప్రొడక్ట్
==> కథ, స్క్రీన్ ప్లే: ఆర్.వి. సుబ్రహ్మణ్యం
==> ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.ఎస్. రావు
==> DOP: శ్రీ సాయి కుమార్ దారా
==> సంగీతం: విజయ్ బుల్గానిన్
==> ఎడిటర్: SB ఉద్ధవ్
==> ఆర్ట్ : బేబీ సురేష్ భీమగాని
==> PRO: సాయి సతీష్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook