Atlas Cycle Attagaru Petle: తెలుగు తెరపై మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’..

Atlas Cycle Attagaru Petle: ఫేస్ ఈజ్ ఇండెక్స్ యువర్ మైండ్ అని అంటారు. పేరుతోనే కొన్ని సినిమాలు ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేస్తాయి. ఇపుడు తెలుగులో ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ మూవీతోనే సినిమాపై ఆసక్తి రేకెత్తించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 28, 2025, 10:00 AM IST
Atlas Cycle Attagaru Petle: తెలుగు తెరపై మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’..

Atlas Cycle Attagaru Petle:రాజా దుస్సా డైరెక్షన్ లో  శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ పై గాలి కృష్ణ నిర్మిస్తున్న సినిమా'అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే'. తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటి ప్రయత్నంలోనే ‘దేశముదురు’ ఫేమ్ హన్సిక మోత్వానీ లీడ్ రోల్లో ‘105 మినిట్స్’ అనే సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ తో డిఫరెంట్ అటెంప్ట్ చేసిన రాజా దుస్సా.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గా తెలంగాణ నేపథ్యంలో ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తెలంగాణ భాష, యాస తో పాటు ఇక్కడ సంస్కృతి సంప్రదాయాల నేపథ్యంలో పూర్తి హిల్లేరియస్ కామెడీ ఎంటర్టేనర్ గా  ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

Add Zee News as a Preferred Source

ఈ చిత్రాన్ని శ్రీ రామకృష్ణ సినిమా " బ్యానర్ పై గాలి కృష్ణ నిర్మిస్తున్నారు. సహ నిర్మాతలుగా నాంపల్లి సోమాచారి, అలూరి రాజిరెడ్డి , రూప కిరణ్ గంజి.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కార్తికేయ శ్రీనివాస్ (వాసు) వ్యవహరిస్తున్నారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ఈ కథ విషయానికి వస్తే 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరంగల్ జిల్లాలో జరిగిన ఒక నిజ జీవిత సంఘటనను ప్రేరణగా తీసుకొని ఈ చిత్రాన్ని పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు రాజా దుస్సా చెప్పారు. ఈ చిత్రానికి కెమెరామెన్ గా వేణు మురళీధర్.వి, ఎక్జుక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కార్తికేయ శ్రీనివాస్ (వాసు ) పని చేస్తున్నారు.

నటినటుల్ని మిగతా సాంకేతికవర్గాన్ని త్వరలోనే తెలియజేస్తామని చిత్రం యూనిట్ తెలిపింది. ఈ సినిమా తెలుగులో వచ్చిన ‘బలగం’ తరహాలో అతిపెద్ద సక్సెస్ అందుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News