Jarann OTT Streaming: రీసెంట్ గా ‘కిష్కింధపురి’ మూవీ జీ5లో సంచలనం రేపింది. అంతేకాదు తక్కువ సమయంలోనే ఎక్కువ మంది చూసిన సినిమాగా జీ5లో మంచి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కేవలం తెలుగులోనే కాదు.. హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఇపుడు మరో హార్రర్ థ్రిల్లర్ ‘జరన్’ జీ5లో స్ట్రీమింగ్ కు రానుంది. గ్రిప్పింగ్ థ్రిల్లర్, హారర్ కంటెంట్‌కి కేరాఫ్ గా పేరు తెచ్చుకున్న "జరణ్"ని తెలుగులో అందిస్తోంది. తెలుగు జీ5లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది "జరణ్". హృషికేష్ గుప్త రచన, దర్శకత్వం వహించారు.
అనీజ్ బాజ్మి ప్రొడక్షన్స్, ఎ అండ్ ఎన్ సినిమాస్ ఎల్ ఎల్పీ, ఏ3 ఈవెంట్స్ అండ్ మీడియా సర్వీసెస్ సంయుక్తంగా నిర్మించాయి. అమృతా శుభాష్, అనితా డేట్ కెల్కర్, కిశోర్ ఖడమ్, జ్యోతి మల్షే, అయానీ జోష్ కీ రోల్లో నటించారు.
రాధ (అమృత శుభాష్), తన కుమార్తె సయీ (అవనీ జోషి)తో కలిసి తన పూర్వీకుల ఇంటికి వెళుతుంది. అక్కడ ఓ ఓ పాత బొమ్మ దొరికిన తర్వాత కొన్ని వింత అనుభవాలు ఎదురువుతూ ఉంటాయి. ఈ సంఘటనలను వెన్నులో వణుకు పుట్టించే మిస్టరీతో తెరకెక్కించారు దర్శకుడు. ఆమెలో నిగూఢంగా దాగి ఉన్న భయాలన్నీ ఒక్కసారిగా పురివిప్పడం, ఆమె ప్రవర్తనలో వింత మార్పు కనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి, ఇల్యూజన్‌కి మధ్య ఉన్న గీత చెరిగిపోవడం, అప్పటి నుంచి ట్రామా, మెమరీ, సూపర్ నేచురల్ ఇంటర్వైన్ కలగలిపి కనిపించే సీన్స్.. ప్రేక్షకులకు ప్రతి క్షణం థ్రిల్ ని పంచేలా ఉంటాయి.
మొత్తంగా హార్రర్ థ్రిల్లర్ పరిస్థితులు, అత్యద్భుతమైన నటీనటుల నటన.. భావోద్వేగాలను రేకిత్తించే కథ, కథనం "జరణ్"రేంజ్ ను పెంచాయి. మానసిక ప్రవృత్తికి అద్దం పట్టేలా ఉంటుంది. ‘జరణ్’ ప్రతి విషయానికీ మనసులో ఎలాంటి భయాందోళనలు, భావోద్వేగాలు మిళితమై నీడలా మెలుగతాయనేది ఇందులో చూపించారు. మరి ఎందకు ఆలస్యం ‘జరన్’ ను ఎంచక్కా జీ5లో చూడొచ్చు.
Also Read: మీ ఏజ్ ప్రకారం రోజు ఎంత లిక్కర్ తీసుకోవాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..
Also Read: చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









