Thathwam: తెలుగులో వస్తోన్న మరో మర్డర్ మిస్టరీ మూవీ ‘తత్త్వం’.. ఫస్ట్ లుక్ తోనే మూవీపై పెరిగిన అంచనాలు..

Thathwam: కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎపుడు ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే ఆ సినిమా పెద్దదైనా.. చిన్నదైనా మంచి విజయాన్ని అందుకుంటాయి. ఈ నేపథ్యంలో తెలుగులో వస్తోన్న మరో చిత్రం ‘తత్త్వం’. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 8, 2025, 01:55 PM IST
Thathwam: తెలుగులో వస్తోన్న మరో మర్డర్ మిస్టరీ మూవీ ‘తత్త్వం’.. ఫస్ట్ లుక్ తోనే మూవీపై పెరిగిన అంచనాలు..

Thathwam: మర్డర్‌ మిస్టరీ జానర్‌ చిత్రాల్లో ఉండే ఉత్కంఠ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంలో ముందుంటాయి. ఈ కోవలో వస్తోన్న మరో చిత్రం ‘తత్త్వం’. దినేష్ ‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేస్తోన్న ఈ చిత్రంతో  అర్జున్‌ కోల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.  త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లావిష్ గా  నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు మారుతి, కల్ట్‌ చిత్రాల నిర్మాత ఎస్‌కేఎన్‌ తమ సామాజిక మాధ్యమాల ద్వారా  విడుదల చేసి చిత్ర బృందానికి ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు.

Add Zee News as a Preferred Source

దర్శకుడు మాట్లాడుతూ '' మా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసిన మారుతి, ఎస్‌కేఎన్‌లకు మా  తరుపున థాంక్స్.  పెళ్లి చూపుల కోసమని ఓ గ్రామానికి వెళ్లిన హీరో, ఆ ఊరిలో జరిగిన హత్యల కేసులో ఎలా ఇరుక్కున్నాడు? ఆ కేసుల నుంచి అతను ఎలా బయటపడగలిగాడు ? ఈ నేపథ్యంలో
ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుంది. మొత్తంగా ఈ పరిణామాల మధ్యలో హీరో తెలుసుకున్న తత్వం ఏమిటి?  అనేది ఈ మూవీ స్టోరీ.

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా, ప్రేక్షకులను సీట్లలో కదలనీయకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు. నిర్మాత మాట్లాడుతూ '' ఈతరం ప్రేక్షకులకు కావాలసిన  అన్ని అంశాలతో ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుల్లో ఒక రకమైన  ఉత్కంఠ  ఈ చిత్రంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్‌గా ఉండనుందని చెప్పుకొచ్చారు. మా పోస్టర్‌ను విడుదల చేసిన మారుతి, ఎస్‌కేఎన్‌లకు మా టీమ్ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: భరత్‌ రోంగలి, ఎడిటర్‌: విప్లవ్‌ నైషదం,కెమెరా: భరత్‌ పట్టి, దర్శకుడు: అర్జున్‌ కోల, నిర్మాత: వంశీ సీమకుర్తి.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News