)
Nishaanchi Trailer Talk:జార్ పిక్చర్స్ బ్యానర్‌పై అజయ్ రాయ్, రంజన్ సింగ్ నిర్మాణంలో, ఫ్లిప్ ఫిల్మ్స్ సహకారంతో తెరకెక్కిన చిత్రం ‘నిశాంచి’. ఈ చిత్రానికి ప్రసూన్ మిశ్రా, రంజన్ చండేల్, అనురాగ్ కశ్యప్ కథనాన్ని అందించారు. అమెజాన్ ఎంజీఎం స్టూడియో ఇండియా భాగస్వామిగా ఉంది. ఈ చిత్రంతో ఐశ్వరి థాకరే బబ్లూ – దబ్లూ అనే కవల సోదరుల డ్యూయల్ రూల్స్ లో నటిస్తూ పరిచయం కాబోతున్నారు. వేదిక పింటో, మోనిక పన్వర్, మొహమ్మద్ జీషాన్ ఆయుబ్, కుముద్ మిశ్రా ఇతర ముక్యపాత్రల్లో నటించారు.
2000వ దశకం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అనురాగ్ కశ్యప్. ఈ ట్రైలర్ లో ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో సాగిన ఈ కథలో యాక్షన్, డ్రామా, రొమాన్స్, హాస్యం, మా కా ప్యార్తో పాటు ఫుల్ మసాలా ఎంటర్టెయిన్మెంట్ తో ఈ సినిమాను ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అనురాగ్ కశ్యప్ మరోసారి తన మార్క్ చూపించాడు.
భారతీయ సినిమాకు తనదైన ముద్ర వేసిన అనురాగ్ కశ్యప్ ఈ సినిమాతో దర్శకుడిగా బ్యాక్ బౌన్స్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది. ఐశ్వరి, వేదిక పింటో సహా మొత్తం తారాగణం అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.నిశాంచి – ప్రేమ, ఘర్షణ, సంగీతం, భావోద్వేగాల కలయికగా రాబోతున్న ఈ మసాలా ఎంటర్టెయినర్ సెప్టెంబర్ 19న థియేటర్లలో సందడి చేయనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.