Nishabdham Movie: ఓటీటీలోనే స్వీటీ సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్

కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా అన్నీ రంగాలు నష్టాలను చవిచూశాయి. సినీ పరిశ్రమ మొత్తం కుదేలయింది. అయితే మార్చిలో ప్రకటించిన కరోనా లాక్‌డౌన్ నాటినుంచి షూటింగ్‌లన్నీ నిలిచిపోగా.. థియేటర్లన్నీ మూతబడిన సంగతి తెలిసిందే.

Updated: Sep 18, 2020, 05:07 PM IST
Nishabdham Movie: ఓటీటీలోనే స్వీటీ సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్
Image Courtesy : Twitter

Anushka Shetty Movie Nishabdham Date Fix: కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా అన్నీ రంగాలు నష్టాలను చవిచూశాయి. సినీ పరిశ్రమ మొత్తం కుదేలయింది. అయితే మార్చిలో ప్రకటించిన కరోనా లాక్‌డౌన్ నాటినుంచి షూటింగ్‌లన్నీ నిలిచిపోగా.. థియేటర్లన్నీ మూతబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా సినిమాల షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ.. రిలీజ్ కాలేదు. కొన్ని చిత్రాలు ఇప్పటికే ఓటీటీ మార్గంలో రిలీజ్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో నాని, సుధీర్ నటించిన బ్లాక్ బాస్టర్ ‘వీ’ సినిమా అమెజాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. ఈక్రమంలోనే మరో పెద్ద సినిమా కూడా ఓటీటీ మార్గంలోనే విడుదలకు సిద్ధమైంది. టాలీవుడ్ స్వీటీ అనుష్క (Anushka Shetty), మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ చిత్రం ‘నిశ్శబ్దం’ ( Nishabdham Movie) అక్టోబరు 2న ఓటీటీ (OTT) లో అమెజాన్‌లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ శుక్రవారం వెల్లడించింది.  Also read: Dubai: ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధం

థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్‌ పాత్రలో నటించింది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం చిత్రంలో అనుష్కతోపాటు.. మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినమాను కోన వెంక‌ట్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను మొదట ఏప్రిల్ 2న విడుదల చేయాలని భావించినప్పటికీ.. కరోనా కారణంగా వీలుకాలేదు. అయితే.. ఈ నిశ్శబ్దం చిత్రం తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషాల్లో విడుదల కానుంది. Also read: Apple: యాపిల్ ప్రియులకు శుభవార్త.. భారత్‌లో త్వరలోనే స్టోర్ ప్రారంభం