Anushka: ఘాటి సినిమాకు అనుష్క దూరం.. ఇదేం ట్విస్టు రా బాబు..!

Anushka Ghaati : అనుష్క ఎన్నో సంవత్సరాల తరువాత..ఘాటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి కొన్ని విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అంతే కాదు ఈ చిత్రానికి అనుష్క దూరం కానుంది అనే వార్త కూడా వినిపిస్తోంది..

Written by - Vishnupriya | Last Updated : Jun 7, 2025, 08:19 PM IST
Anushka: ఘాటి సినిమాకు అనుష్క దూరం.. ఇదేం ట్విస్టు రా బాబు..!

Anushka missing Ghaati promotions: టాలీవుడ్‌లో అనుష్క శెట్టి పేరు చెప్పగానే లేడీ ఓరియంటెడ్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ‘అరుంధతి’, ‘భాగమతి’, ‘వేదం’ వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఇటీవల సినిమాల ఎంపికలో అనుష్క చాలా ఆలస్యంగా అడుగులు వేస్తోంది. బాహుబలి తరువాత అనుష్క పెద్దగా సినిమాలలో కనిపించలేదు.

Add Zee News as a Preferred Source

కేవలం.. ఒకటి లేదా రెండు చిత్రాలలో మాత్రమే నటించింది. ఇక ఈ మధ్య..2023లో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. అంతకముందు 2020లో నిశబ్దం ఓటీటీలో విడుదల కాగా, 2018లో భాగమతి అనుష్కకు చివరిసారి మంచి విజయం తీసుకొచ్చిన చిత్రం అయింది. ఈ సినిమా తర్వాత.. ఈ హీరోయిన్ కి.. ఇప్పటివరకు ఒక్క సూపర్ హిట్ కూడా లేకపోవడం గమనర్హం.

ఈ పరిస్థితుల్లో దర్శకుడు క్రిష్‌తో కలిసి అనుష్క చేస్తున్న తాజా సినిమా ఘాటి పట్ల ఆసక్తి పెరిగింది. ఈ సినిమా షూటింగ్ చాలా చప్పగా పూర్తవ్వగా, అనుష్క పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్‌ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మునుపెన్నడూ చూడని రఫ్ అండ్ ఇంటెన్స్ పాత్రలో అనుష్క కనిపించడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి.

జులై 11న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేసేందుకు టీమ్ సిద్ధమవుతోంది. అయితే ప్రమోషన్ కార్యక్రమాల్లో అనుష్క పాల్గొనబోతుందా అనే ప్రశ్నలు ప్రేక్షకుల్ని వెంటాడుతున్నాయి. గతంలో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్‌ల్లోనూ ఆమె హాజరు కాకపోవడం వేసిన విషయమే. దాంతో..ఘాటి ప్రమోషన్ బాధ్యతల్ని కూడా తాను చేపట్టుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. 

ఇక అనుష్క ఆరోగ్యం, లుక్ విషయంలో కొన్ని పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో, ఘాటి ప్రమోషన్‌లకు ఆమె హాజరుకాకపోవచ్చు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాబట్టి.. ఘాటి ప్రమోషన్స్ కి ఇక అనుష్క దూరమే అన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో సినిమా విజయంపై ఈ ప్రచారం ప్రభావం పడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: RBI News: ఆటోమొబైల్ ఇండస్ట్రీకి వరం...ఆర్బిఐ నిర్ణయంతో ఫుల్ ఖుషి..!!  

Also Read: Govt Employee Retirement Age: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు  పెంపు.. ఎంతంటే..!!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News