Ar Rahman speaks about trolls when he announced divorce: లెజండరీ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ గతేడాది తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్ సైరా భానుతో ఉన్న 29 ఏళ్ల అనుబంధానికి బ్రేకప్ చెప్పేశారు.ఈ క్రమంలో ప్రస్తుతం మరొసారి రెహమాన్ తన డైవర్స్ అంశంపై మాట్లాడారు.ఈ క్రమంలో రెహమాన్ సతీమణి సైరా భాను తన లాయర్ వందనా షాతో డైవర్స్ ప్రకటించారు. ఆ తర్వాత తమ ఇద్దరి నిర్ణయాన్ని గౌరవిస్తారని కోరుకుంటున్నట్లు ఎక్స్ లో కామెంట్లు చేశారు.
అదే విధంగా రెహమాన్ ముగ్గురు సంతానం కూడా తమ తల్లిదండ్రులు వ్యక్తిగత నిర్ణయాలను దయచేసి ఎవరు తప్పుగా చూడొద్దని చెప్పుకొచ్చారు. అయితే.. కొందరు ట్రోలర్స్ మాత్రం రెహమాన్ ను ఇష్టమున్నట్లు ట్రోల్స్ చేశారు. ఆయన తనదగ్గర ఉన్న అసిస్టెంట్ మోహనీ డేతో ఎఫైర్ పెట్టుకున్నారని కూడా నీచపు మాటలు మాట్లాడారు. దీనిపై రెహమాన్ సైతం అప్పట్లో చట్టపరంగా ముందుకు వెళ్తానని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఏఆర్ రెహమాన్ మరోసారి ట్రోలర్స్ కు తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. తమ డైవర్స్ తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరిగిందన్నారు. నన్ను విమర్శించిన వారు సైతం.. తన కుటుంబ సభ్యులే అని రెహమాన్ చెప్పుకొచ్చారు. కానీ ఒకరి మనస్సులను గాయపర్చే విధంగా.. ఇలాంటి ట్రోల్స్ చేయడం సరికాదన్నారు. ఇలాంటివి మార్చుకొవాలని కోరుకుంటానని అన్నారు.
సెలబ్రిటీల జీవితాల గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటారు. వారి జీవితంలో ఏం జరుగుతుందో చూస్తుంటారు.. విమర్శలు చేస్తారు.. కానీ ఏదైన ఒక పరిధిని దాటకుండా ఉండాలన్నారు. నేను ఒకరి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే.. రేపు నా కుటుంబం గురించి ఎవరో తప్పుగా మాట్లాడుతారు అని రెహమాన్ కర్మసిద్దాంతం గురించి చెప్పుకొచ్చారు.
ఒకరి గురించి తప్పుగా మాట్లాడకూడదు.. ఎందుకంటే.. ప్రతి ఒక్కరికి కూడా అందరిలోనే...సోదరి, సోదరుడు, తల్లిదండ్రులు, కుటుంబం ఉంటుందని రెహమాన్ అన్నారు. ఎవరైన తనను బాధను కల్గిస్తే.. ‘దేవుడా, వారిని క్షమించి, సన్మార్గంలో నడిపించు’ అని కోరుకుంటానని రెహమాన్ చెప్పుకోచ్చాడు. ఇదిలా ఉండగా.. 1995 లో సైరా భానును పెళ్లిచేసుకున్న రెహమాన్.. 29 ఏళ్లతర్వాత తమ పెళ్లి బంధానికి ఫుల్ స్టాప్ చెప్పిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









