Ashwin Babu: మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో వస్తోన్న అశ్విన్ బాబు.. ఆసక్తిరేకిస్తోన్న ఫస్ట్ లుక్..

Ashwin Babu: తెలుగు యంగ్ హీరోల్లో ఒక మూసకు పరిమితం కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలతో అలరిస్తున్నాడు అశ్విన్ బాబు. తాజాగా ఈయన హీరోగా నటించిన మూవీ ‘వచ్చినవాడు గౌతమ్’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 7, 2025, 02:51 PM IST
Ashwin Babu: మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో వస్తోన్న అశ్విన్ బాబు.. ఆసక్తిరేకిస్తోన్న ఫస్ట్ లుక్..

Ashwin Babu: అశ్విన్ బాబు కథానాయకుడిగా..మామిడాల ఎం .ఆర్. కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వచ్చినవాడు గౌతమ్’.  అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.డిఫరెంట్ కాన్సెప్ట్ తో  ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు నుండి వస్తున్న మరో వెరైటీ చిత్రం 'వచ్చినవాడు గౌతమ్'. మెడికల్ యాక్షన్ మిస్టరీ  గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నిర్మాత టి. గణపతి రెడ్డి ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా  ఎంతో ఉన్నత విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన అశ్విన్ బాబు లుక్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి.   ఈ చిత్రంలో సాయి రోణక్ క్యామియో పాత్ర లో కనిపించనున్నారు.

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

ఈ చిత్రంలో అశ్విన్ బాబు తో పాటు, రియా సుమన్, అయేషా ఖాన్, సచిన్ ఖేడేకర్, అభినయ, మురళీ శర్మ,  అజయ్, VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ, అమర దీప్, అభిత్ భూషణ్, నాగి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. ఎం. ఎన్. బాల్ రెడ్డి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించారు. M R వర్మ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సురేష్ భీమగని ఆర్ట్ డైరెక్టర్  పని చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం  పూర్తైయింది. మిగిలిన షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తూనే ఉంది.  త్వరలో మేకర్స్ ఈ మూవీ విడుదల తేదిని  అనౌన్స్ చేయనున్నారు.

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News