
Ugadi 2025 venu swamy predictions: వేణు స్వామి మరోసారి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కాంట్రవర్సీ జ్యోతిష్యంతో కాకరేపుతున్న వేణు స్వామి మరో బాంబు పేల్చారు. ఇప్పటికే ప్రభాస్, సమంత, విజయ్ దేవర కొండ మీద దిమ్మతిరిగే విధంగా జాతకం చెప్పారు. మెయిన్ గా ప్రభాస్ కు వ్యాధులున్నాయని, విజయ్, సమంత సూసైడ్ చేసుకుంటారని కూడా జ్యోతిష్యం చెప్పారు. గతంలో కూడా వేణు స్వామి చైతు, శోభితల మీద కాంట్రవర్సీ జ్యోతిష్యం చెప్పాడు.
శుభమా.. అంటూ ఎంగెజ్ మెంట్ చేసుకుంటే.. చైతుకు మళ్లీ డైవర్స్ అయిపోతుందని కూడా రచ్చ రాజేశాడు. దీంతో వేణుస్వామిమీద మహిళ సంఘాలు సీరియస్ అయ్యాయి. తెలంగాణ మహిళ కమిషన్ కు వెళ్లి ఫిర్యాదు సైతం చేశాయి. వేణు స్వామి మహిళ కమిషన్ ముందు హజరై...మరోసారి కాంట్రవర్సీ జ్యోతిష్యం చెప్పానంటూ కామెంట్లు చేశారు. బహిరంగంగా సారీ కూడా చెప్పారు. అయిన కూడా వేణుస్వామి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదని చెప్పుకొవచ్చు.
వేణు స్వామి తాజాగా.. విశ్వావసు నామ సంవత్సరం వేళ కొన్ని రాశుల వారు జైల్లో ఊచలు లెక్కిస్తారని కూడా షాకింగ్ జ్యోతిష్యం చెప్పారు. ముఖ్యంగా..మీన రాశిలో ఈసారి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుందన్నారు. దీని ప్రభావ వల్ల.. తుల రాశి, మేశం, మీనం, సింహం, ధనస్సు రాశులుఉన్న సెలబ్రీటీలు చిక్కుల్లో పడతారని.. జైలుకు కూడా వెళ్లేందుకు అవకాశం ఉందని కూడా వేణుస్వామి షాకింగ్ జాతక ఫలాలు వెల్లడించారు.
మరీ ఈ రాశుల వారు ఉన్న సెలబ్రీటీలు చాలా జాగ్రత్తగా ఉండాలని.. లైఫ్ లో ఆచీతూచి అడుగు పెట్టాలని కూడా వేణు స్వామి పలు సూచనలు వెల్లడించారు. ఈ క్రమంలో వేణు స్వామి చెప్పిన జాతకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe