AS Ravi Kumar Chowdary Passes Away: తెలుగు సినీ దర్శకుడు AS రవికుమార్ చౌదరి (AS Ravi Kumar Chowdary) అకాల మరణం చెందారు. గత రాత్రి ఈయన కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన మరణంపై పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. గత కొంతకాలంగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న ఈయన రీసెంట్ గా రాజ్ తరుణ్ తో ‘తిరగబడరా సామి’ సినిమాతో పలకరించారు. ఈ చిత్రం అంతగా అలరించలేకపోయింది.
గోపీచంద్ హీరోగా తెరకెకకిన ‘యజ్ఞం’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లో సత్తా చూపెట్టారు. తొలి చిత్రంతోనే దర్శకుడిగా తన టాలెంట్ ఏంటో చూపించారు. ఆ తర్వాత బాలకృష్ణతో చేసిన ‘వీరభద్ర’ సినిమాతో అతిపెద్ద డిజాస్టర్ అందుకున్నాడు. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయమైన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ లేక డిప్రెషన్ కు గురైనట్టు సమాచారం.
దీంతో ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. చేతిలో సినిమాలు లేకపోవడం.. రెండింటి మధ్య ఒత్తిడికి లోనై రవికుమార్ చౌదరి కృంగిపోయాడు. దీంతో ఈయన గుండెపోటుతో మృతి చెందినట్టు తెలుస్తుంది.
Also Read: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డు ఎన్టీఆర్, బాలకృష్ణలకు మాత్రమే సొంతం..
Also Read: ఈ పుట్టినరోజు నందమూరి బాలకృష్ణకు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









