)
Attitude Star Chandrahas: సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్‌కు సమాధానం చెప్పేందుకు తాను నిరంతరం కష్టపడుతుంటానని చెప్పాడు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. వరుస సినిమాలతో జోరు మీదున్న ఈ యంగ్ హీరో.. తాజాగా మరో చిత్రం అనౌన్స్ చేశాడు. చంద్రహాస్ బర్త్ డే సందర్భంగా కాయిన్ మూవీ గ్లింప్స్, టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు జైరామ్ చిటికెల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీకాంత్ రాజారత్నం నిర్మిస్తున్నారు. ఈ సందర్భగా సాయి రాజేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. రూ.5 కాయిన్ చుట్టూ ఇంత జరిగిందా..? అని తెలిసి షాక్ అయ్యానని.. ఈ సినిమా ట్రైలర్ వచ్చిన తరువాత అంచనాలు పెరుగుతాయని నమ్మకంతో ఉన్నానని అన్నారు.
హీరో ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ.. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు చెప్పారు. పాత రూ.5 కాయిన్స్‌ని బ్యాన్ చేయడం.. ఆ కాయిన్స్ మెల్ట్ చేయడం.. వాటి బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ అనే పాయింట్లతో డైరెక్టర్ జైరామ్ కథను అద్భుతంగా రాసుకున్నారని తెలిపారు. భవిష్యత్‌లో ఆయన స్టార్ డైరెక్టర్ అవుతారని అన్నారు. కథ నచ్చితే తాను ఏ జానర్ అనేది చూడనని.. అన్ని రకాల సినిమాలు తీసేందుకు ప్రయత్నిస్తుంటానని అన్నారు. కథ, సినిమాలను తానే ఒకే చేస్తుంటానని.. నాన్న అప్పుడప్పుడు సలహాలు ఇస్తున్నాంటారని చెప్పారు. తనను సపోర్ట్ చేసిన వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టేందుకు.. తనను ట్రోల్ చేసే వారికి సమాధానం చెప్పేందుకు తాను ఎప్పుడూ కష్టపడుతుంటానన్నారు.
డైరెక్టర్ జైరామ్ చిటికెల మాట్లాడుతూ .. రూ.5 కాయిన్ ఎందుకు బ్యాన్ అయిందనే నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు మున్ముందు చెబుతామని అన్నారు. సమ్మర్ లో థియేటర్లలో విడుదల చేస్తామని వెల్లడించారు. మ్యూజిక్ డైరెక్టర్ నిమిషి జాకియాస్ మాట్లాడుతూ .. దర్శకుడు జైరామ్ తన స్నేహితుడు అని.. నాలుగేళ్ల నుంచి తమ బంధం కొనసాగుతోందన్నారు. చంద్రహాస్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయాలని ఐదు రోజుల క్రితం తనకు చెప్పాడని.. రెండ్రోజుల క్రితమే పుటేజ్ పంపించాడని చెప్పారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఈ ఫస్ట్ ఫ్లిప్ కోసం తాను చేశానని.. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ వస్తుందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook