
Vaishnavi Chaitanya Remuneration: చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తన అందం.. నటనతో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. తాజాగా ఆమెకు సంబంధించిన రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు హీరోయిన్లు ఎవరూ తీసుకోనంత రెమ్యునరేషన్ తీసుకుంటుందనే వార్త వైరలవుతోంది. ఆమె రూ.కోటిపైనే ఆర్జిస్తోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అందం, అభినయం ఉన్నా తెలుగమ్మాయిలు సినీ పరిశ్రమలో రాణించలేని ఈ సమయంలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ హీరోయిన్గా వైష్ణవి చైతన్య అరంగేట్రం చేశారు. తొలి సినిమాతో సంచలన విజయం అందుకున్న వైష్ణవి చైతన్య ఇప్పుడు బిజీ హీరోయిన్గా మారారు. కెరీర్ ప్రారంభంలో 'లవ్ ఇన్ 143 అవర్స్' 'ది సాఫ్ట్వేర్ డెవలపర్' 'అరెరె మానస' 'మిస్సమ్మ' వంటి షార్ట్ ఫిల్మ్స్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి అనంతరం బుల్లితెర నుంచి వెండి తెరపై మెరిసింది. 'అల వైకుంఠపురములో' అల్లు అర్జున్ సోదరిగా.. 'వరుడు కావలెను' వంటి క్రేజీ సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించి మెప్పించారు.
నటనతో గుర్తింపు పొందిన వైష్ణవి నటనను చూసిన దర్శక, నిర్మాతలు 'బేబీ' సినిమాకు అవకాశం ఇచ్చారు. 'బేబీ'లో ఇద్దరు హీరోలు ఉన్నా సినిమా కథ మొత్తం వైష్ణవి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆమె నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంలో వైష్ణవి పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుతం ఆమె సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి నటిస్తున్న 'జాక్' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయంతో అలరించనున్నట్లు తెలుస్తోంది.
'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర' బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఏప్రిల్ 10వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. '90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్‌సిరీస్‌కి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమాలో కూడా ఆనంద్ దేవరకొండతో మరోసారి వైష్ణవి జోడీ కట్టనుంది. 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నారు.
వరుస సినిమాలు చేస్తూ క్రేజ్ సంపాదించిన వైష్ణవి తాజాగా రెమ్యునరేషన్ పెంచిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు టాలీవుడ్లో క్రేజ్ ఉన్న హీరోయిన్లు, డిమాండ్ ఉన్న హీరోయిన్లు బాగా తక్కువగానే ఉన్నారు. ఈ సమయంలో దర్శక నిర్మాతల చూపు వైష్ణవి చైతన్యపై పడింది. తమ సినిమాల్లో వైష్ణవి నటించాలని వాళ్లు పట్టుబడుతుండడంతో వైష్ణవి ఇది ఛాన్సంటూ తన రేటు పెంచినట్లు తెలుస్తోంది. వైష్ణవి పారితోషికం పెంచినట్టు సమాచారం. ఇటీవల ఓ కొత్త సినిమా కోసం వైష్ణవి చైతన్యకి రూ.కోటి దాకా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఓ యువ నిర్మాత, దర్శకుడు ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వైష్ణవికి ఉన్న క్రేజ్ కారణంగా ఆమెకు భారీ స్థాయిలో ఇచ్చేందుకు ఈ దర్శకనిర్మాతలు సిద్దమైనట్టు సమాచారం. ఇలా కోటి పారితోషికం అందుకున్న తెలుగు హీరోయిన్ ఎవరూ లేరని చెప్పవచ్చు. మరి ఇదే ఊపుతో కొనసాగుతూ వైష్ణవి త్వరలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంటారా అనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe