Bahubali Epic Collections: బాహుబలి చిత్రం మొదటి భాగాన్ని ‘బాహుబలి ది బిగినింగ్’ తో రిలీజ్ చేశారు. రెండో భాగాన్ని ‘బాహుబలి ది కంక్లూజన్’ పేరుతో రిలీజ్ చేస్తే సెన్సేషనల్ విజయం సాధించింది. రీసెంట్ గా ఈ సినిమాను రెండు భాగాలుగా గత నెల 31న రీ రిలీజ్ చేశారు. అంతేకాదు కొత్త సినిమా రేంజ్ లో ప్రీమియర్స్ కు ప్రదర్శిస్తే ఒక్క టికెట్ ముక్క మిగల్లేదు. రీసెంట్ గా ఈ సినిమాను మొదటి భాగం విడుదలైన పదేళ్ల తర్వాత రెండు భాగాలను కలిపి ఎడిటింగ్ చేసి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో ఒకే సినిమాగా రీ రిలీజ్ చేశారు. ఇపుడీ సినిమా సంచలన వసూళ్లు సాధించి రీ రిలీజ్ లలో మన దేశంలో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.
ఇక ‘బాహుబలి ఎపిక్’ ఫస్ట్ డే ప్రీమియర్స్ తో ప్రపంచ వ్యాప్తంగా రూ. 20 కోట్ల గ్రాస్ వసూల్లను రాబట్టింది. అంతేకాదు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రీ రిలీజ్ లో ఎవరు అందుకోనంత ఎత్తులో నిలిచింది. ఇక ఈ సినిమా రిలీజ్ ముందు వచ్చిన హైప్ తో ఈ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ రాబడుతుందని అందరు అనుకున్నారు. కానీ వీకెండ్ తర్వాత ఈ సినిమా నెమ్మదించి.. చివరకు రూ. 50 కోట్ల గ్రాస్ దగ్గర ఆగిపోయింది. మిగిలిన రన్ లో ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్స్ ను రాబడుతుందో చూడాలి.
రెండు భాగాలుగా విడుదలైన ఓ చిత్రాన్ని ఒకే సినిమాగా విడుదల చేయడం బహుశా ప్రపంచ సినీ చరిత్రలో ఇదే మొదటి సారి అని చెప్పాలి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. మిగత భాషల వాళ్లు బాహుబలి ఎపిక్ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. ఆల్రెడీ ఎన్నో సార్లు ఓటీటీ , టీవీల్లో చూడటంతో వాళ్లు బాహుబలి రీ రిలీజ్ ను పెద్దగా పట్టించుకోలేదు. అటు ఓవర్సీస్ లో కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే మంచి వసూళ్లు రాబట్టాయి. పైగా తెలుగు హీరో ప్రభాస్, రాజమౌళి వంటివి రీ రిలీజ్ లో మంచి ప్రమోషన్స్ చేయడంతో ప్రేక్షకులు రెండు పార్టులు తెరపై ఎలా చూపించరనే ఆతృతతో చూశారు. మొత్తంగా ప్రేక్షకులు 3 గంటల 45 నిమిషాల సినిమాను చూసి తెగ ఎంజాయ్ చేశారు.
అంతేకాదు రీ రిలీజ్ లో ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. వరల్డ్ వైడ్ గా బాహుబలి ఎపిక్ సినిమా రీ రిలీజ్ లో ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి. అంతేకాదు ఏది ఏమైనా రీ రిలీజ్ లో కూడా ‘బాహుబలి’ చిత్రం అసలు సిసలు బాహబలి అనిపించుకుంది.కానీ వీళ్లు ఆశించింది ఒకటి. వచ్చిన వసూళ్లు మరొకటి. అయినా.. ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం అనేది కూడా పెద్ద విషయమే అంటున్నారు సినీ విశ్లేషకులు.
Also Read: మీ ఏజ్ ప్రకారం రోజు ఎంత లిక్కర్ తీసుకోవాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..
Also Read: చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









