Bakasura Restaraunt: ఆసక్తి రేకిస్తోన్న 'బకాసుర రెస్టారెంట్‌' ఫస్ట్‌లుక్‌ పోస్టర్..

Bakasura Restaurant: ప్రముఖ కమెడియన్‌, నటుడు ప్రవీణ్ త్వరలోనే  ‘బకాసుర’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నారు.. అనే న్యూస్‌  అందరిలోనూ కాస్త ఆసక్తి కలిగించాడు. అయితే ప్రవీణ్‌ నటుడిగా బిజీగానే ఉన్నాడు కదా.. మరీ వ్యాపారంలోకి ఎందుకు వెళ్లుతున్నాడు అనే సందేహం కూడా అందరిలో మెదిలింది.  అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఈ న్యూస్‌పై ఓ క్లారిటీ వచ్చింది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 3, 2025, 04:45 PM IST
Bakasura Restaraunt: ఆసక్తి రేకిస్తోన్న 'బకాసుర రెస్టారెంట్‌' ఫస్ట్‌లుక్‌ పోస్టర్..

Bakasura Restaurant : అవును ప్రవీణ్‌ ఎటువంటి రెస్టారెంట్‌ను స్టార్ట్ చేయడం లేదు.. ఆయన లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం పేరు 'బకాసుర రెస్టారెంట్‌'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ ను  విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో ప్రవీణ్‌ పెద్ద గరిటెతో వంట చేస్తూ ఉండటం.. ఆ పక్కనే ఇతర పాత్రలు ఆ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. ఆ పోస్టర్‌లోనే గమనిస్తే వైవా హర్ష, షైనింగ్‌ ఫణి మరో వైపు విచిత్రంగా సమ్‌థింగ్‌ స్పెషల్‌ క్యారెక్టర్స్ గా  కనిపిస్తున్నారు.ఎన్నో విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ తొలిసారి లీడ్  పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో యాక్ట్ చేస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Add Zee News as a Preferred Source

చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ప్రమోషనల్‌ భాగంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ '' హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేటి యువతరంతో పాటు అన్ని వర్గాలు అలరించే అంశాలున్నాయని చెబుతున్నారు.

ఈ సినిమాలో ప్రతి సీన్  అందరికి ఎంతో థ్రిల్ల్‌ను పంచుతుందన్నారు. ప్రవీణ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా ఇది ఉండబోతుందన్నారు.  నటుడిగా ఆయనలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నారు మేకర్స్. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.  ప్రవీణ్‌, వైవా హర్ష, షైనింగ్‌ ఫణి (బమ్‌చిక్‌ బంటి), శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఉప్పెన జయకృష్ణ, కేజీఎఫ్‌ గరుడ రామ్‌, కృష్ణభగవాన్‌, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌పటాస్‌, రమ్య, ప్రాచీ ఠాకూర్‌, జబర్థస్త్‌ అప్పారావు తదితరులు యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి బాల సరస్వతి  డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.  బాల సరస్వతి, ఎడిటర్‌: మార్తండ్‌.కె.వెంకటేష్‌, సంగీతం: వికాస్‌ బడిస, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్‌ కొట్టి, ఆర్ట్‌ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్‌ తంగాల, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి, దర్శకత్వం: ఎస్‌జే శివ

ఇదీ చదవండి:  కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !

ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News