)
Akhanda 2 Thandavam Now in 3D : బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అఖండ 2’. ఇప్పటికే విడుదలైన టీజర్, తో పాటు తాజాగా విడుదల చేసిన టైటిల్ సాంగ్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇకపై శివరాత్రితో పాటు భక్తి పాటల్లో ఈ పాటకు చోటు ఉంటుందనే రీతిలో విజువల్స్ పరంగా బాగుంది. తాజాగా ఈ సినిమాను 3Dలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి. బాలయ్య కెరీర్ లో తొలిసారి ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలవుతున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. అంతేకాదు 65 యేళ్ల వయసులో ఓ హీరో సినిమా ఇలా రిలీజ్ కావడం విశేషమనే చెప్పాలి. ఈ సినిమాను హిమాలయాల్లోని మానస సరోవరం, భారత్ లోని శైవ క్షేత్రాలతో పాటు విదేశాల్లో చిత్రీకరించారు. కొన్ని సీన్స్ ను మైనస్ 11 డిగ్రీల సెల్సియస్ లో పిక్చరైజ్ చేసినట్టు చెప్పుకొచ్చారు.
బాలకృష్ణ తన కెరీర్ లో తొలిసారి తన సూపర్ హిట్ చిత్రమైన ‘అఖండ’కు సీక్వెల్ గా ‘అఖండ 2 తాండవం’ సినిమా చేశారు. అంతేకాదు ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో బాలకృష్ణ ఓన్ డబ్బింగ్ చెప్పడం బాగుంది. ఆయన హిందీలో చెప్పిన డైలాగులు కూడా బాగున్నాయి. తమన్ ఈ సినిమాకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోసాడు. తాజాగా విడుదలైన అఖండ 2 తాండవం టైటిల్ సాంగ్ లో శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ తో పాటు ఇతర బృందం పాడిన పాట ఆకట్టుకునేలా ఉంది
‘అఖండ 2 తాండవం’ సినిమా థియేట్రికల్ ప్లస్ ఓటీటీ, శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఈ చిత్రం నైజాం రూ. 36 కోట్లు.. సీడెడ్ లో రూ. 24 కోట్లు..ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 55 కోట్లు.. నార్త్ అమెరికా ఓవర్సీస్ రైట్స్ కలిపి రూ. 31 కోట్లు ($3.5 యూఎస్ డాలర్స్)కు అమ్ముడు పోయింది. మొత్తంగా థియేట్రికల్ గా బాలయ్య కెరీర్ లో హైయ్యెస్ట్ బిజినెస్ రూ. 146 కోట్లు చేసింది. ఇక ఓటీటీ హక్కులు .. రూ 104 కోట్లు ఐదు భాషలకు కలిపి అమ్ముడు పోయింది. శాటిలైట్ రైట్స్ రూ. 60 కోట్లు.. మ్యూజిక్ .. రూ. 8 కోట్లు.. కలిపి రూ. 172 కోట్లకు అమ్ముడు పోయింది. మొత్తంగా థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ కలిసి ఈ సినిమా రూ. 318 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అందులో నిర్మాతలకు నాన్ థియేట్రికల్ గానే రూ. 172 కోట్లు లాభాలను అందుకున్నారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో తొలి ప్యాన్ ఇండియా సినిమా. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.
అఖండ 2 తాండవం సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి యాక్ట్ చేశాడు. ఇందులో పహల్గామ్ ఉగ్రదాడి ఎపిసోడ్ ను యాడ్ చేసినట్టు సమాచారం. మరోవైపు బాలయ్య రీసెంట్ గా ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో ఆయన పేరు చేరింది. అంతేకాదు ముంబై లోని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ లో ఘంట వాయించిన తొలి సౌత్ హీరోగా రికార్డు చేసారు. అంతేకాదు బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు తెలుగులో జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కైవసం చేసుకుంది. అంతేకాదు జనవరిలో రిపబ్లిక్ డే నాడు కేంద్రం ఆయన్ని పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది. ‘అన్ స్టాపబుల్’ టాక్ షోతో పాటు 60 యేళ్ల పై బడిన వయసులో వరసగా కమర్షియల్ యాడ్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. మరి ఈ ఇయర్ ఎండ్ ను ‘అఖండ 2 తాండవం’ చిత్రం ఎలా ఎండ్ కార్డ్ వేస్తాడనేది సినీ ఇండస్ట్రీ ఆసక్తి రేకిత్తోస్తోంది. మరి ఆ అంచనాలను అఖండ 2 తాండవం ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.