)
బాలయ్య తన కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్నాడు. తాజాగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ‘అఖండ 2 తాండవం’ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసారు. నిజంగా బాలయ్యను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు మించి చూపించబోతున్నట్టు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మొత్తంగా దైవభక్తికి ఈ సారి దేశభక్తి జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడు. అఖండ 2లో మహా కుంభమేళా ఎపిసోడ్ తో పాటు పహల్గామ్ ఎపిసోడ్ ను ప్రత్యేకంగా బోయపాటి శ్రీను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా బాలయ్య నట విశ్వరూపాన్ని మరోసారి వెండితెరపై చూడబోతున్నాము. అటు పాకిస్థాన్, చైనా సైన్యాలతో శివాంశ సంభూతుడైన అఖండ వారి నుంచి దేశాన్ని ఎలా రక్షించాడనేదే ఈ ట్రైలర్ లో చూడబోతున్నాము.
మరోవైపు మీరు ప్రపంచంలోని ఏ దేశంలో వెళ్లిన మీకు అక్కడ కనిపించేది ఓ మంతం. ఈ దేశంలో ఎటు చూసిన కనిపించేది ఓ ధర్మం. సనాతన హైందవ ధర్మం. అంటూ చెప్పిన డైలాగులు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు. దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాము. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అంటూ.. పెద్ద గన్ తో బుల్లెట్ల వర్షం కురిపించే సీన్ మాస్ కు గూస్ బంప్సే అని చెప్పాలి. ఇప్పటి వరకు ప్రపంచ పటంలో మా దేశ రూపాన్నే చూసి ఉంటావు. విశ్వరూపాన్ని చూసి ఉండవు. శతృ సైనికులను చీల్చి చెండాడే సీన్స్ తో పాటు మేము లేచి నిలబడితే ఆ శబ్దానికే ప్రపంచం మా సొంతం అంటూ బాలయ్య చెప్పే డైలాగులు ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా ఈ సారి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య సర్జికల్ స్ట్రైక్ ఖాయం అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని 3డీ వెర్షన్ లో విడుదల చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరును పెంచారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ను ముంబైలో రిలీజ్ చేసారు. తాజాగా ఈ చిత్రాన్ని 3డీ వెర్షన్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.బాలకృష్ణ కెరీర్ లో తొలిసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ ఇదే. ఈ సినిమాను హిమాలయాల్లోని మానస సరోవరం, భారత్ లోని శైవ క్షేత్రాలతో పాటు విదేశాల్లో షూట్ చేశారు. కొన్ని సీన్స్ ను మైనస్ 11 డిగ్రీల సెల్సియస్ లో పిక్చరైజ్ చేశారు. మొత్తంగా ట్రైలర్ తో సినిమా అంచాలను పెంచేసారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.