Balakrishna: ఇన్నేళ్ల బాలయ్య కెరీర్ లో ఈ రెండు సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది.. ఇంతకీ ఏమిటా సినిమాలు..

Balakrishna: నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో అద్బుత చిత్రాలున్నాయి. అందులో ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్  చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంది.   

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 5, 2025, 05:40 AM IST
Balakrishna: ఇన్నేళ్ల బాలయ్య కెరీర్ లో ఈ రెండు సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది.. ఇంతకీ ఏమిటా సినిమాలు..

Balakrishna: 1991లో ‘ఆదిత్య369’(Aditya 369) సినిమాతో తెలుగు సినిమా సత్తా  చాటిన బాలయ్య.. ఆ  తరువాత యేడాది ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ (Rowdy Inspector) తో Sensation క్రియేట్ చేశారు. తెలుగులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలంటే ఇప్పటికే ‘రైడీ ఇన్ స్పెక్టర్’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. అప్పట్లో కొత్తగా వచ్చిన ఎంతోమంది మాస్ దర్శకులకు రైడీ ఇన్ స్పెక్టర్ సినిమాకు ప్రేరణ అని చెప్పాలి. తెలుగు సినీ చరిత్రలో అప్పటివరకు వచ్చిన పోలీస్ పాత్రలకు కొత్త నిర్వచనం చెప్పిన సినిమాగా రౌడీ ఇన్ స్పెక్టర్ కు ప్రత్యేక స్థానం ఉంది. 

Add Zee News as a Preferred Source

అటు ఆదిత్య 369 సినిమా విషయానికొస్తే.. తెలుగుతో పాటు మన దేశంలో తొలి సైన్స్ ఫిక్షన్ ట్రామ్ ట్రావెల్ సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికీ టీవీల్లో వస్తే ఈ సినిమాకు చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత యేడాదిలోనే రౌడీ ఇన్ స్పెక్టర్ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. పక్కా మాస్ హీరో పోలీస్ క్యారెక్టర్ వేస్తే ఎలా ఉండాలో సినీ ఇండస్ట్రీకి రుచి చూపించిన మూవీ. ఈ రేంజ్ ఎమోషనల్ మాస్ పోలీస్ సినిమా ఇప్పటి వరకు తెలుగులో  రాలేదు. 

బాలయ్య , బి. గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన రెండో సినిమా. బాలకృష్ణ యాక్టింగ్, డైలాగ్స్ వింటుంటే ఇప్పటికీ ప్రేక్షకులు గూస్ బంప్స్ వస్తాయి. ఈ సినిమాలో బాలయ్య డైలాగ్స్ ను చాలామంది డైరెక్టర్స్ రిఫరెన్స్ గా చూపిస్తా ఉంటారు. ఈ సినిమా 1992 మే 7న విడుదలై విజయ దుంధుబి మోగించింది. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురుపించింది. 2 వారాలకు రూ. రెండు కోట్ల షేర్ కలెక్ట్ చేసి, 50రోజులకు రూ. 4 కోట్ల పైగా వసూల్ చేసి, 60 కేంద్రాలలో  50 రోజులు పూర్తి చేసుకొని ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిందీ.

అంతేకాదు ఈ చిత్రం ఆ యేడాది రెండో హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆ సినిమాకు ఈ సినిమాకు కొన్ని లక్షలు తేడా మాత్రమే. లేకపోతే.. బాలయ్య కెరీర్ లో ఈ సినిమా మరో ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది.అప్పట్లో ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ రాయలసీమ ఏరియాలో కోటి రూపాయలు కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ఎన్నో ఏరియాల్లో ఆల్ టైమ్ డిస్ట్రిక్ట్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం 22 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో ఘన విజయం సాధించింది.  అంతేకాదు డబ్బింగ్ వెర్షన్ తమిళం, హిందీల్లో కూడా సిల్వర్ జూబ్లీ క్రియేట్ చేసిన ఏకైక సినిమాగా రికార్డు క్రియేట్ చేయడం విశేషం. 

Also Read:  Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా

Also Read:  NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News