Aditya 369 Pre Re Release Event: రీ రిలీజ్ లో ఆదిత్య 369 మరో సంచలనం.. బాలయ్య మజాకా.. !

Aditya 369 Re Release: గత కొన్ని రోజులుగా తెలుగులో ఓల్డ్ బ్లాక్ బస్టర్స్ మూవీస్ ను రీ రిలీజ్ చేయడమనే ట్రెండ్ నడుస్తోంది. అందులో కల్ట్ క్లాసికల్ గా పేరు తెచ్చుకున్న బాలయ్య హీరోగా నటించిన ‘ఆదిత్య 369’ను ఏప్రిల్ 4న రీ రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు ఆ సినిమా రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చేయడం అనేది ఇదే మొదటి సారి చెప్పాలి. ఈ రకంగా బాలయ్య మరో హిస్టరీ క్రియేట్ చేసారని అభిమానులు చెప్పుకుంటున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 31, 2025, 08:55 AM IST
Aditya 369 Pre Re Release Event: రీ రిలీజ్ లో ఆదిత్య 369 మరో సంచలనం.. బాలయ్య మజాకా.. !

Aditya 369 Pre Re Release Event: నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన కల్ట్ క్లాసిక్ మన దేశంలోనే తొలి సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’, 1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని.. 34 యేళ్ల  తర్వాత  4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో మరింత అధునాతనంగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తెలుగువారి పర్వదినం ఉగాది నాడు హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. భారతదేశ సినిమా చరిత్రలోనే టైమ్ ట్రావెల్ అనే పాయింట్ మీద రూపొందిన ఫస్ట్  సినిమా ‘ఆదిత్య 369’. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో  ఈ సినిమా రూపొందింది. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో కృష్ణకుమార్ అనే యువకుడిగా, శ్రీకృష్ణదేవరాయలుగా అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఈ సినిమా రీ రిలీజ్ ప్రీ రిలీజ్ వేడుకకు బాలయ్యతో పాటు చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తో పాటు దర్శకులు బాబీ,అనిల్ రావిపూడి హాజరయ్యారు.  

Add Zee News as a Preferred Source

 
ఈ సందర్బంగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చెన్నై నుంచి డిజిటల్‌ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో బాలకృష్ణ పోషించిన శ్రీకృష్ణ దేవరాయలు పాత్ర బాగా హైలైట్ అయిందన్నారు. అప్ప‌టికే ఎన్టీ రామారావు  శ్రీ‌కృష్ణదేవరాయల పాత్ర వేశారు. అలాగే `మహామంత్రి తిమ్మ‌రుసు`కు నేను ప‌ని చేశాను. స్క్రిప్ట్ కూడా ఒక వెర్షెన్‌ రాశాను పింగళి నాగేంద్రరావుకి. ఆ రోజుల్లో నాచేత ఒకొక స్క్రిప్ట్ ఫ‌స్ట్ వెర్షెన్ రాయించేవారు. ఆ విధంగా తిమ్మ‌రుసు స్క్రిప్ట్ లో నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను. శ్రీ‌కృష్ణదేవరాయల పాత్ర నాకు చాలా ఇష్టం. ఇక ఆ పాత్ర ఎవ‌రు వేయాల‌ని ఆలోచిస్తున్న‌ప్పుడు.. ఒకే ఒక వ్య‌క్తి మదిలో వ‌చ్చారు. నాడు రామారావు వేసిన శ్రీ‌కృష్ణదేవరాయల పాత్ర‌లో నేడు అంతే అద్భుతంగా రాణించాలంటే బాల‌కృష్ణకు మాత్ర‌మే సాధ్య‌మవుతుంద‌ని నేను నిర్ణ‌యించుకున్నాను. ఆ త‌ర్వాత ఆయ‌న్ను సంప్ర‌దించ‌డం, క‌థ చెప్ప‌డం.. బాల‌కృష్ణకి స్టోరీ బాగా న‌చ్చి సినిమా చేద్దామ‌ని వెంట‌నే ఒప్పుకోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయన్నారు.

కృష్ణదేవరాయలు అనుకున్న తర్వాత బాలకృష్ణ మినహా అప్పుడు ఎవరూ లేరు..ఇప్పుడూ ఎవరూ లేరు. ఆయన ఎవర్‌గ్రీన్ అన్నారు. అలాగే ఈ సబ్జెక్టుతో సినిమా నిర్మించాలంటే, పెద్దపెద్దవాళ్ళు సందేహిస్తున్న సమయంలో ఇందులో ఏదో వుంది అన్నఫీలింగ్‌తో నిర్మించడానికి శివలెంక కృష్ణప్రసాద్ ముందుకువచ్చారు. ఈ సినిమా క్రెడిట్‌లో సింహభాగం శివలెంక కృష్ణప్రసాద్‌కి దక్కుతుందన్నారు. ఇన్నేళ్ళ తర్వాత ఈ సినిమా అత్యాధునికంగా విడుదల కావడం ఆనందించదగ్గ విషయం అన్నరు.

ఈ రీ రిలీజ్ లో ‘ఆదిత్య 369’ మూవీ రీ-రిలీజ్‌కి సంబంధించిన ట్రైలర్ ను  దర్శకులు బాబీ, అనిల్ రావిపూడి విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ, ‘‘ఈ సినిమా విడులైనప్పుడు నేను నాలుగో, ఐదో చదువుతున్నాను. గుంటూరులో చూశాను. ఈ సినిమాని రీ-రిలీజ్ చేస్తున్న  కృష్ణప్రసాద్ కి కృతజ్ఞతలు. ఈ తరం వారికి ఈ సినిమాని చూపించాలన్న ఆలోచన రావడం చాలా గొప్ప విషయమన్నారు. నేను బాలకృష్ణ గారితో రూపొందించిన ‘డాకూ మహరాజ్‌’ సినిమా కేరెక్టర్‌కి ఇన్‌స్పిరేషన్ ‘ఆదిత్య 369’. రీ రిలీజ్‌లో కూడా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాని అప్పట్లో  అద్దంకి శ్రీరామా థియేటర్‌లో చూశాను. అప్పుడు నాకు 9 యేళ్లు. ఈ సినిమా వాల్ పోస్టర్ చూసి, బాగా ఆకర్షితుడణ్ణి అయ్యాను. సినిమా చూస్తుంటే ఇక మరో ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలిగింది. ఆ క్లాసిక్‌ మూవీని ప్రింట్ నుంచి డిజిటల్‌కి తీసుకురావడం అద్భుతమన్నారు.  ఇలాంటి సినిమాలను సేవ్ చేయడం అవసరమన్నారు. ఈ సినిమాని చూసి ఈ జనరేషన్ కూడా మెస్మరైజ్ అవుతారన్నారు. ఆ రోజుల్లో ఈ సినిమా చూడటమే ఒక అదృష్టమైతే, ఇప్పుడు ఈ సినిమా కార్యక్రమంలో పాల్గొనడం కూడా మరో అదృష్టమన్నారు.  

నటుడు బాబూమోహన్ మాట్లాడుతూ.. ‘‘బాలకృష్ణతో వుంటే షూటింగ్ చేసినట్టు వుండదు.. ఆడుకోవడానికి వెళ్ళినట్టు వుండేది. బాలకృష్ణ రెండు పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. నా దేవుడు ఎన్టీ రామారావు  అంశం. ఫైట్స్ షూటింగ్ అప్పుడు చూస్తే అద్భుతం. రెండు పాత్రలో కనులు మిరుమిట్లు గొలిపాయి. ఈ సినిమా తీసిన కృష్ణప్రసాద్ ధైర్యానికి మెచ్చుకోవాలి. దర్శకుడు సింగీతం సృష్ణించిన సృష్టి ఈ సినిమా. ఈ మూవీ ిగురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సినది మిగిలే వుంటుంది. తరతరాలుగా ఈ సినిమాని కొత్త సినిమాలాగా చూస్తారన్నారు.

శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘అప్పటికి నేను చిన్నోడు-పెద్దోడు సినిమా మాత్రమే చేశారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  మంచి సినిమా చేద్దువుగాని అని అంటూ వుండేవారు. కొద్దిరోజుల తర్వాతే ఆయన సింగీతంని కలవమని చెప్పారు. సింగీతం అద్భుతమైన కథ చెప్పారని అన్నారు. సింగీతంని కలిశాను. ఆయన అరగంట సేపు కథను చెప్పారు. కొన్ని సినిమాలు చూడమన్నారు. చూశాను. నాకు థ్రిల్లింగా అనిపిస్తోంది. కానీ, కొంచెం అర్థమయ్యీ కాకుండా వుంది అన్నాను. అప్పుడు బాలసుబ్రహ్మణ్. ఈ సినిమా తీయి. నిర్మాతగా కొన్ని దశాబ్దాలు మిగిలిపోతావు అన్నారు. నన్నునమ్ము అన్నారు. ఇది కేవలం నందమూరి బాలకృష్ణ చేస్తేనే ఈ సినిమా తీస్తాను అని సింగీతం  అన్నారు. దేవీవరప్రసాద్  సహకారంతో బాలకృష్ణ ని కలిశాము.  అప్పుడు బాలకృష్ణ  పూర్తి కమర్షియల్ సినిమాలు చేసే సమయం. బాలకృష్ణ గారిని కలిసి కథను చెప్పగానే, వెంటనే చాలా బాగుంది. నేను చేస్తున్నాను. అన్నారు. ఆ 30 సంవత్సరాల వయసులో బాలకృష్ణ  ఇలాంటి క్లాస్ కథను ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. ఈ సినిమా నిర్మించడం నా పూర్వజన్మ సుకృతమన్నారు. ఆ సినిమా ప్రారంభించినప్పటి నుంచి అంతా పండగే. ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే చర్చ జరుగుతూ వుండేది. చాలామంది ప్రముఖులు సెట్స్ కు  అందరూ వచ్చి షూటింగ్ చూసేవారు. నేను ఎన్ని సినిమాలు తీసినా ‘ఆదిత్య369’ సినిమా ఇచ్చిన గౌరవం ఇప్పటికీ నన్ను నడిపిస్తోందన్నారు. ఈ సినిమాని నిర్మించడం నా అదృష్ణం. ఎస్పీ  బాలసుబ్రహ్మణ్యం, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, నందమూరి బాలకృష్ణ కి జీవితాంతం రుణపడి వుంటాను. బాలకృష్ణ గారు ఈ సినిమా కోసం బాగా కష్టించి పనిచేశారు. తపనతో పనిచేశారు. ఇన్నేళ్ళ తర్వాత ‘ఆదిత్య 369’ని మళ్ళీ విడుదల చేయడం నాకెంతో సంతోషాన్ని కలిగించే అంశం.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘సినిమా సినిమాకి వేరియేషన్స్ కోసం ప్రయత్నిస్తున్న సమయం అది. చలనచిత్ర పరిశ్రమలో ఒక కమర్షియల్ ట్రెండ్ సెట్ చేసింది,  విశ్వానికే నటన ఎలా వుంటుందో చూపించింది నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడైన నందమూరి తారక రామారావు. ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. గ్లామర్ పాత్రలు చేసే సమయంలోనే ‘రాజు-పేద’ సినిమాలో డీ గ్లామర్ పాత్ర చేశారు. ఆయన స్ఫూర్తితో నేను భైరవద్వీపంలో చాలా డీగ్లామర్ పాత్రని చేశాను. ‘ఆదిత్య 369’ సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర ధరించడానికి నాన్నగారే ఇన్‌స్పిరేషన్. కొత్త కాన్సెప్ట్‌ తో సింగీతం, కృష్ణప్రసాద్ , బాలసుబ్రహ్మణ్యం  నా దగ్గరకి వచ్చినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను. మంచి సినిమా అవుతుందన్న నమ్మకంతో ప్రోత్సహించాను. ఈ సినిమాలో నేను ధరించిన రెండు పాత్రల్లో చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఆయా పాత్రల ఆత్మలోకి ప్రవేశించినప్పుడే అది కనిపిస్తుంది.

సింగీతం శ్రీనివాసరావు అంతకుముందు చేసిన సినిమాలు నేను చూశాను. ఆయన దర్శకత్వంలో, ఒక కొత్త కాన్సెప్ట్.తో సినిమా చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ సినిమాని నేను రీ-రిలీజ్ అని భావించడం లేదు. కొత్త సినిమా అన్నట్టుగానే అనుకుంటున్నాను. అందుకే ఇది ప్రీరిలీజ్ ఫంక్షనే తప్ప, రీరిలీజ్ ఫంక్షన్ అని నేను అనుకోవడం లేదు. ఇప్పటి యూత్‌కి కూడా బాగా నచ్చే సినిమా అవుతుందన్నారు.  ఈ ఏప్రిల్ 4న అద్భుతం జరగబోతోందన్నారు. ఈ సినిమా సీక్వెల్ కూడా త్వరలో  మొదలు కాబోతున్నట్టు బాలయ్య ప్రకటించారు.

ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!

ఇదీ చదవండి:  Jaya Prada Husband: నటి జయప్రద పెళ్లై ముగ్గురు పిల్లల తండ్రిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. షాకింగ్ నిజాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News