Padma Bhushan Awards: నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన నటనతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగు ఇండస్ట్రీకి అందించిన ఈ హీరో ఇప్పుడు.. మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మభూషణ్' అవార్డును అందుకున్నారు.
ఈ గౌరవం ఆయన సినీ రంగంలో చేసిన విశిష్ట కృషి.. అలానే ఆయన చేసిన ఎన్నో ప్రజాసేవలను.. గుర్తించి అందింప చేయబడింది. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ఈ అవార్డును.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలకృష్ణకు..అందజేశారు.
బాలకృష్ణ తన సినీ ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో అద్భుతమైన పనులు చేసి.. పేరు ప్రఖ్యాతి పొందాడు. తెలుగు సినిమా రంగంలో 100కి పైగా సినిమాలలో నటించి, పౌరాణిక, చారిత్రాత్మక, సాంఘిక, సోషియో ఫాంటసీ వంటి అనేక విభాగాల్లో.. ప్రత్యేక పాత్రలు పోషించారు.
ఆయన కేవలం సినిమా రంగంలోనే కాక, రాజకీయ రంగంలో కూడా తన సేవలను అందించారు. హిందూపురం నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన.. ఆయన ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేశాడు. అంతేకాకుండా..బాలకృష్ణ తన తల్లి బసవతారకం స్మారకంగా స్థాపించిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా.. అనేక మంది క్యాన్సర్ రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు.
ఇక ఇప్పుడు వీటన్నిటికీ గాను..బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును స్వీకరించడంతో.. అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. సోషల్ మీడియాలో "Padma Bhushan NBK" హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి. అభిమానులు, రాజకీయ నాయకులు.. సినీ ప్రముఖులు బాలకృష్ణను అభినందించారు. ఇక బాలకృష్ణ అవార్డు అందుకున్న ఫోటోలు.. అలానే.. ఈ అవార్డు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు బాలయ్య తన ఫ్యామిలీతో తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు..బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన అభిమానులు అత్యంత ఆనందం వ్యక్తం చేశారు. 'జై బాలయ్య' అంటూ నినాదాలు చేస్తూ తెగ సందడి చేస్తున్నారు.
ఇక సినిమాల పరంగా కూడా ప్రస్తుతం బాలకృష్ణ దూసుకుపోతున్నారు. ఈ మధ్యనే బాలయ్య వరసగా నాలుగు సూపర్ హిట్లు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు బాలయ్య. బోయపాతి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుంది అని అంచనాలు వేస్తున్నారు అందరూ.
Read more: Snake Bite Video: పాము ఎంత కసితీరా కాటు వేస్తుందో తెలుసా..?.. షాకింగ్ వీడియో మీ కోసం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









