)
Balakrishna In Nimmakuru: సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించి సరదాగా గడిపారు. తన తండ్రి పుట్టిన ఊరులో పర్యటించి ఇటీవల తాను పొందిన అవార్డుల ఆనందాన్ని గ్రామస్తులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంపై అపూర్వమైన ప్రేమ ప్రకటించారు. 'పాత్రలకు ప్రాణం పోస్తూ నటించిన నాన్న ఎన్టీఆర్ దరిదాపులకు చేరాలన్నదే నా తపన' అని ప్రకటించారు. తన విజయాలను తన తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో గురువారం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ పర్యటించారు. గ్రామంలోని ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించిన అనంతరం బాలయ్య మాట్లాడుతూ.. 'సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకుని, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడంతోపాటు పద్మభూషణ్ పొందిన ఆనందం మీతో పంచుకోవాలని వచ్చా' అని గ్రామస్తులతో బాలకృష్ణ చెప్పారు.
'పద్మభూషణ్, దేశంలో మొదటి కళాకారుడుగా బుక్ ఆఫర్ రికార్డ్స్‌లో స్థానం పొందడం. వరుస సినీ విజయాలను... ప్రజల విజయాలుగా భావిస్తున్నా' అని బాలకృష్ణ ప్రకటించారు. పదవులు తనకు ముఖ్యం కాదని.. వాటికే తాను అలంకారమన్నది తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ విజయాలన్నీ తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. తండ్రైనా.. గురువైనా.. దేవుడైన తకు అన్నీ ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. పాత్రలకు ప్రాణం పోస్తూ నటించిన నాన్న ఎన్టీఆర్ దరిదాపులకు చేరాలన్నదే తన తపన అని వెల్లడించారు.
'ఎన్టీఆర్ ఉన్నత స్థితికి రావడానికి తల్లి బసవతారకం చేసిన త్యాగాలు, అందించిన సహకారం ఎనలేనిది. హిందూపురం ఎమ్మెల్యేగా, రాయలసీమను నా అడ్డాగా భావిస్తా. దృఢ సంకల్పం ఉంటే భగీరథులు కావచ్చని... రాయలసీమకు నీళ్లు ఇచ్చి చంద్రబాబు నిరూపించారు. హిందూపురంలో తాగునీటి సమస్య పరిష్కరించడం సంతోషంగా ఉంది' అని బాలకృష్ణ వివరించారు. 'ఎన్టీఆర్, నేను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నేడు భౌగోళికంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ వైద్య సేవలు అందిస్తున్నాం' అని వెల్లడించారు.
సందేశం ఉండాలనే లక్ష్యంతో ప్రతి సినిమా చేస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు. తన సంతోషాన్ని గ్రామస్తులతో పంచుకోవాలని నిమ్మకూరు వచ్చినట్లు చెప్పారు. 'ఎక్కడ ఉన్నా తెలుగు వారంతా ఒకటే అన్నది ఎన్టీఆర్ భావన.. నా ఆలోచన కూడా. వరదలతో తెలంగాణలో చాలామంది నష్టపోయారు. అన్నదాతలు విలవిలలాడుతున్నారు. తెలుగు వారికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా పరస్పరం సహకరించుకుంటూ అండగా ఉండాలి' అని వెల్లడించారు. మంచి ఉద్దేశంతో అఖండ 2 తీశామని.. కులాలకు ఆపాదించకుండా హైందవ ధర్మానికి ప్రతిరూపంగా తెరకెక్కించినట్లు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.