Balakrishna to replace Nagarjuna : బుల్లితెరపై దూసుకెళ్తున్న రియాలిటీ షో 'బిగ్ బాస్' తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుని, తొమ్మిదో సీజన్‌కి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా సీజన్‌కు సంబంధించి ఒక ఆసక్తికర సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈసారి హోస్ట్ మారబోతున్నారని వినికిడి. బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హొస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నందమూరి హీరో ఎంట్రీ ఇవ్వనన్నారు. టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణను హోస్ట్‌గా తీసుకునే ఆలోచన జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకూ బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీజన్‌కు నాని స్వీకరించారు. మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా నాగార్జున స్థానంలో బాలయ్యను తీసుకురావాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.
'అన్స్టాపబుల్' వెబ్ షోతో బాలయ్య బుల్లితెరపై తనదైన మార్క్ చూపించాడు. ఆయన యాంకరింగ్‌కి మంచి స్పందన రావడంతో, ఇప్పుడు రియాలిటీ షోకు కూడా పటిష్ట హోస్ట్‌గా మారవచ్చని భావిస్తున్నారు. బాలయ్య మాస్ యాపిల్‌గా ఉండటంతో, బిగ్ బాస్‌కి ఆయన వస్తే కొత్త ఉత్సాహం వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇక మరోవైపు రానా దగ్గుబాటి పేరు కూడా వినిపిస్తోంది. రానా కూడా యూత్‌లో మంచి ఫాలోయింగ్ కలిగి ఉండటం, అనుభవం ఉండటం వల్ల ఆయన్ను కూడా పరిశీలనలో ఉంచినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇది అన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే. బిగ్ బాస్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బాలకృష్ణ ఈ షోకి హోస్ట్‌గా రానున్నారనే వార్తలు వచ్చినప్పటి నుంచీ, ఆయన అభిమానుల్లో సందడి నెలకొంది. సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్స్‌తో ప్రచారం జోరుగా సాగుతోంది. టీవీ ప్రేక్షకులు, అభిమానులు బాలయ్యను బిగ్ బాస్ హోస్ట్‌గా చూడాలనే ఆసక్తితో ఉన్నారు.
ఇటీవల వరుసగా సూపర్ హిట్లు అందుకుంటూ..తెలుగు తెరపై నటసింహగా కొనసాగుతున్న బాలయ్య, బుల్లితెరపై కూడా తన హవా చూపించబోతున్నాడా? అనేది చూడాల్సిందే.
ఇక సినిమాలో పరంగా చూసుకుంటే బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









