Balakrishna vs Chiranjeevi: చిరంజీవి.. బాలకృష్ణ మధ్య.. రాచుకున్న నిప్పు.. బాలయ్య.. చిరుకి క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్..!

Chiranjeevi Vs Balakrishna : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నటుడు.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులను తీవ్రంగా బాధించాయి. ఈ కారణంగా సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.

Written by - Vishnupriya | Last Updated : Sep 26, 2025, 02:48 PM IST
Balakrishna vs Chiranjeevi: చిరంజీవి.. బాలకృష్ణ మధ్య.. రాచుకున్న నిప్పు.. బాలయ్య.. చిరుకి క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్..!

Mega Fans Demand Apologies From Balakrishna : చిరంజీవి కూడా బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ప్రశాంతంగా ఉన్నప్పటికీ, అభిమానులు మాత్రం ఆగ్రహంతో ఉప్పొంగుతున్నారు. అఖిల భారత చిరంజీవి యువత ఒక ప్రకటన చేస్తూ..బాలకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరింది.

Add Zee News as a Preferred Source

మెగా అభిమానుల ప్రకారం, చిరంజీవి ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు. ఎవరినీ కించపరచేలా మాట్లాడరు. కానీ బాలకృష్ణ మాత్రం పలు సందర్భాల్లో మెగా కుటుంబంపై వ్యంగ్యంగా మాట్లాడారని ఆరోపిస్తున్నారు. అలాగే, గతంలో బాలకృష్ణ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు మెగా కుటుంబం.. అండగా నిలిచిందని గుర్తు చేస్తున్నారు. అయినా ఇప్పుడు అసెంబ్లీ వేదికగా కూడా అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిమానులు అంటున్నారు.

“అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని ఉద్దేశించి వ్యంగంగా మాట్లాడిన  నందమూరి బాలకృష్ణ గారు వెంటనే బహిరంగంగా క్షమాపణ  చెప్పాలి. గతంలో కూడా బాలకృష్ణ గారు అనేక  సార్లు అవమానకరంగా మాట్లాడటం జరిగింది. కానీ ఎప్పుడూ కూడా చిరంజీవి గారు స్పందించలేదు. అభిమానులుగా మేము కూడా ఆయన మనసెరిగి సంయమనం పాటించాము. 
బాలకృష్ణ గారి కుటుంబం తీవ్ర వేధింపులకు గురై, జైలు పాలైనప్పుడు అండగా నిలుచుందీ... మెగా కుటుంబమే అన్న విజ్ఞత మరిచి, అధికార మదం తలకెక్కించుకున్న బాలకృష్ణ గారు నేడు చట్టసభల్లో సైతం చిరంజీవి గారి ప్రతిష్టను దిగజార్చేవిధంగా మాట్లాడేందుకు తెగించారు. కాబట్టి..చిరంజీవి అభిమానులుగా మేము సైతం బాలకృష్ణ వైఖరిని, వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.  వెంటనే బాలకృష్ణ గారు స్పందించి, బహిరంగ క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేస్తున్నాం,” అని లేఖ విడుదల చేశారు అఖిల భారత చిరంజీవి యువత

 ఇకముందు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తామని, ప్రజాక్షేత్రంలో బాలకృష్ణకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతాయని తెలిపారు. “మా దైవం చిరంజీవి గారి గౌరవం దెబ్బతిన్నప్పుడు మేము మౌనంగా ఉండం” అని పేర్కొన్నారు.

సినిమా ఇండస్ట్రీలో ఇద్దరూ పెద్ద స్థాయి నటులు. కానీ వ్యక్తిగత, రాజకీయ కారణాలతో ఈ రకమైన వ్యాఖ్యలు రావడం అభిమానుల్లో విభేదాలు పెంచుతోంది. ప్రజలు మాత్రం ఇద్దరూ ఒకరినొకరు గౌరవిస్తూ ముందుకు సాగితే మంచిదని భావిస్తున్నారు.

మొత్తం మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లోనూ, సినీ ప్రపంచంలోనూ పెద్ద దుమారం రేపాయి. ఇప్పుడు అందరి చూపు బాలకృష్ణపై ఉంది. ఆయన క్షమాపణ చెబుతారా? లేక మరింత వివాదం ముదురుతుందా? అన్నది చూడాలి.

Read more: Couple Romance Video: ఏంట్రా ఈ బరితెగింపు..?.. బస్టాండ్‌లో యువతిని ముద్దులు పెడుతూ, అక్కడ చెయ్యిపెట్టి మరీ.!. వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News