Bandi: బందీ సినిమాకి ఘనవిజయం అందించినందుకు.. ఆడియెన్స్‌కు హీరో ఆదిత్య ఓం థాంక్స్

Bandi movie success meet: బందీ సినిమా విజయాన్ని జరుపుకుంటూ చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో హీరో ఆదిత్య ఓం, దర్శకుడు రఘు తిరుమల, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. బందీ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రావడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఆదిత్య ఓం మాట్లాడుతూ, ఈ విజయానికి కారణమైన ఆడియెన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Written by - Vishnupriya | Last Updated : Mar 7, 2025, 04:59 PM IST
Bandi: బందీ సినిమాకి ఘనవిజయం అందించినందుకు.. ఆడియెన్స్‌కు హీరో ఆదిత్య ఓం థాంక్స్

Aditya Om Bandi movie:
విలక్షణ నటుడు ఆదిత్య ఓం ప్రధాన పాత్రలో నటించిన 'బందీ' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రఘు తిరుమల దర్శకత్వంలో గల్లీ సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం, మంచి స్పందనతో విజయాన్ని అందుకుంది. థియేటర్లలో అద్భుతమైన ఆదరణ పొందిన ఈ సినిమా విజయాన్ని జరుపుకోవడానికి చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  

Add Zee News as a Preferred Source

సక్సెస్ మీట్‌లో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, "బందీ సినిమా అద్భుతమైన సందేశంతో రూపొందింది. పర్యావరణ పరిరక్షణ అనే గొప్ప భావనతో తీసిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందుకే ఇంకా హౌస్ ఫుల్ షోలు సాగుతున్నాయి. ఆదిత్య ఓం విలక్షణ నటుడు. ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. రఘు తిరుమల మంచి పాయింట్‌ను ఎంచుకుని అందరికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమా కమర్షియల్‌గా విజయవంతం కావడం ఆనందంగా ఉంది" అని అన్నారు.  

దర్శకుడు రఘు తిరుమల మాట్లాడుతూ, "బందీ సినిమాను తెరకెక్కించడంలో ఆదిత్య ఓం గారు మా లాంటి కొత్త వాళ్లను ఎంతో ప్రోత్సహించారు. ఆయన సహకారంతోనే ఈ మూవీని ఎంతో భావోద్వేగంతో తీర్చిదిద్దగలిగాం. ముఖ్యంగా వెంకటేశ్వర రావు గారు ఈ సినిమాను చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు. విజువల్స్, మ్యూజిక్, కథాంశం అన్నీ ప్రేక్షకుల మెప్పును పొందాయి. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మా చిత్రబృందం తరఫున ధన్యవాదాలు" అని తెలిపారు.  

సక్సెస్ మీట్‌లో హీరో ఆదిత్య ఓం మాట్లాడుతూ, "బందీ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. పర్యావరణ సమస్యలపై అవగాహన కలిగించే ఈ చిత్రాన్ని మరింత మంది చూడాలంటే, మీడియా మరింత సహాయపడాలి. ప్రస్తుతం ప్రకృతి అసమతుల్యత వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అలాంటి సమయంలో బందీ లాంటి చిత్రాలు ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఉపయోగపడతాయి. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ మద్దతుతో మేము ఇంకా మంచి సినిమాలు అందించడానికి కృషి చేస్తాం" అని అన్నారు.  

'బందీ' సినిమా విడుదలైనప్పటి నుంచి విశేషమైన స్పందన వస్తోంది. ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు రావడం, హౌస్ ఫుల్ షోలు సాగడం చిత్రయూనిట్‌ను ఉత్సాహపరుస్తోంది. పర్యావరణ సమస్యలపై చర్చకు దారి తీసిన ఈ చిత్రం, కమర్షియల్‌గా కూడా విజయవంతమవడం గమనార్హం. సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఇలాంటి సందేశాత్మక చిత్రాలకు మద్దతుగా నిలిస్తే, మరిన్ని మంచి చిత్రాలు రావడానికి మార్గం సుగమం అవుతుంది.

Also Read: New Posts For Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. రెవెన్యూ శాఖ‌లో నూత‌న అధ్యాయం

Also Read: Double Bedroom Scheme: డబుల్ బెడ్రూమ్‌ పేరిట ఘరానా మోసం.. 200 మంది లబోదిబో

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News