)
Kishkindhapuri Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగులో హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకు మంచి గిరాకీ ఉంటుంది. మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి డైరెక్ట్ చేశాడు. గతంలో ‘చావు కబురు చల్లగా’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన ఈ దర్శకుడు.. తాజాగా ‘కిష్కింధపురి’ వంటి హార్రర్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూను నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ‘AAA’ లో ప్రదర్శించారు. దీనికి మంచి రెస్పాన్స్ లభించింది. హారర్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ కు ఇప్పటికే విశేష స్సందన లభించింది. భైరవం తర్వాత వస్తున్న ఈ చిత్రం కోసం బెల్లం కొండ చెప్పులరిగేలా ప్రచారం చేస్తున్నాడు. అంతేకాదు సినిమా ఔట్ పుట్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ నెల 12న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా ప్రివ్యూ ఎలా ఉందంటే..
సినిమా మొదలైన 10 నిమిషాల వరకు కథలో వెళ్లేందుకు సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఊహించని ట్విస్టులతో ఆడియన్స్ ను ఇంటర్వెల్ వరకు ఎంగేజ్ చేసాడు. ముఖ్యంగా ‘కిష్కింధపురి’ లో అడుగుపెడుతుంటే ఆడియన్స్ గుండెలు పట్టుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఒక సీన్ తర్వాత నెక్ట్స్ సీన్స్ ఏమవుతుందా అనే రేంజ్ లో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయగలిగాడు. కిష్కింధపురిలోని సువర్ణ మాయ ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లేలా చేసాడు.
ఫస్టాఫ్ లో సూటిగా సుత్తి లేకుండా చెప్పడం బాగుంది. హార్రర్ ఎలిమెంట్స్ బీసీ ఆడియన్స్ తో పాటు ఏ సెంటర్ ప్రేక్షకులను కూడా అలరించేలా ఉంది. సెకాండాప్ ఫ్లాష్ బ్యాక్ రొటిన్ అనిపిస్తోంది. క్లైమాక్స్ ను ఇంకాస్త బెటర్ చేసి ఉంటే బాగుండేది. దర్శకుడు ఉన్నంతలో ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగాడు. ఈ సినిమా తర్వాత దర్శకుడికి ఆఫర్స్ రావచ్చు. ఈ సినిమా ప్లస్ పాయింట్ కేవలం రెండు గంటల్లోనే సినిమాను చుట్టేయడం ప్రేక్షకులను రిలీఫ్ ఇచ్చే అంశమనే చెప్పాలి. ఆర్ఆర్ ఈ సినిమాకు ప్రాణంలా నిలిచింది. రాజా కృష్ణన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర బాగుంది. బెల్లంకొండకు ఈ జానర్ పర్ఫెక్ట్ గా సెట్ అయిందనే చెప్పాలి. తన మార్క్ యాక్టింగ్ తో అదరగొట్టేసాడు. మొత్తంగా కిష్కింధపరి ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం పక్కా. చివర్లో ఈ సినిమాకు సీక్వెల్ ఉందంటూ ప్రకటించడం కొసమెరుపు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.