Bhaje Vaayu Vegam: కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భజే వాయు వేగం'. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పనలో యూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. కార్తికేయ గుమ్మకొండ సరసన ఐశ్వర్య మీనన్ నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న "భజే వాయు వేగం" సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాను నేషనల్ వైడ్ గా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ద్వారా 'భజే వాయు వేగం' మూవీని  రిలీజ్ చేస్తున్నారు. 'బేబి', 'గుంటూరు కారం', 'హనుమాన్', 'గామి', 'ఓం భీమ్ బుష్', 'టిల్లు స్క్వేర్' వంటి సూపర్ హిట్ సినిమాల డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తున్నారు ధీరజ్ మొగిలినేని. తాజాగా కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.


ఇదీ చదవండి:  ఏపీలో కాబోయే సీఎంపై వెంకన్న సాక్షిగా రేవంత్ హాట్ కామెంట్స్..


'భజే వాయు వేగం' సినిమా విషయానికొస్తే.. ఈ మధ్య కాలంలో హనుమంతుడికి సంబంధించిన అన్ని సినిమాలు మంచి విజయాలే సాధించాయి. అదే హనుమంతుడికి సంబంధించిన 'భజే వాయు వేగం' సినిమా కూడా హిట్ అందుకుంటుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. కార్తికేయ గుమ్మకొండ విషయానికొస్తే.. 2017లో 'ప్రేమతో మీ కార్తీక్' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇతను.. ఆ తర్వాత RX100 మూవీతో హీరోగా సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అంతేకాదు హీరోగా నటిస్తూనే.. నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్‌' మూవీతో పాటు అజిత్ హీరోగా నటించిన 'వాలిమై' మూవీలో మెయిన్ విలన్‌గా నటించి దక్షిణాదిలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. లాస్ట్ ఇయర్ 'బెదర్లంక 2012' మూవీతో సక్సెస్ అందుకున్న కార్తికేయ..ఇపుడు 'భజే వాయు వేగం' మూవీతో హిట్ ట్రాక్ కంటిన్యూ చేస్తాడా ? లేదా అనేది చూడాలి.


ఇదీ చదవండి: తెలంగాణ వాసులకు శుభవార్త.. వచ్చే 5 రోజులు వానలే వానలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook