Srikalahasti Temple: మహా శివరాత్రిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని మంచు కుటుంబంతోపాటు భక్త కన్నప్ప సినిమా బృందం దర్శించుకుంది. ఆలయ క్షేత్రంలో సినీ నటులు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్, కొరియోగ్రాఫర్ దర్శకుడయిన ప్రభుదేవా తదితరులు ఆలయాన్ని సందర్శించి శ్రీకాళహస్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారికి వాయు లింగేశ్వర స్వామి సమేత జ్ఞాన ప్రసూనాంబ దేవిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయించి అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. కాగా ఆలయ క్షేత్రంలో ప్రత్యేకంగా ల్యాప్‌టాప్‌లో భక్త కన్నప్ప సినిమా టీజర్‌ను మంచు విష్ణు ప్రదర్శించడం గమనార్హం.
Also Read: Edupayala Jathara: మహా శివరాత్రికి కనుల పండువగా ఏడుపాయల జాతర
దర్శనం అనంతరం భక్త కన్నప్ప సినిమా చేస్తున్న మంచు విష్ణు మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను పంచుకున్నారు. ఏప్రిల్ 25వ తేదీన భక్త కన్నప్ప సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కన్నప్ప సినిమాను భగవంతుడితోపాటు ప్రజల ఆశీస్సులు ఉండాలని మంచు విష్ణు తెలిపారు. శ్రీకాళహస్తీ దర్శనం అనంతరం భక్త కన్నప్ప చిత్రబృందం తిరుమల సందర్శనకు వెళ్లింది. ఈ సందర్భంగా శ్రీవారి మెట్ల నుంచి నడక మార్గంలో మంచు విష్ణు తదితరులు తిరుమల కొండపైకి వెళ్లారు.
Also Read: Tragedy In Srisailam: మహా శివరాత్రి వేళ శ్రీశైలంలో అపశ్రుతి.. నదిలో తండ్రీకొడుకులు జల సమాధి
శ్రీకాళహస్తీశ్వర స్థల పురాణంపై రామజోగయ్య శాస్త్రి రాసిన పాటకు తన కుమార్తె అరియానా, విరియానా నటించారని మంచు విష్ణు తెలిపారు. మార్చి 19వ తేదీన తన తండ్రి మంచు మోహన్ బాబు జన్మదినం సందర్భంగా పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఒక నాస్తికుడు దేవుడి భక్తుడు అయిన తర్వాత ఎలా అవుతాడని భక్త కన్నప్ప సినిమాలో ఉంటుందని మంచు విష్ణు తెలిపాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









